జీర్ణ ఆరోగ్యానికి సోంపు చాలా మేలు చేస్తుంది. ఉబ్బరం, అజీర్ణం, గ్యాస్, గుండెల్లో మంట వంటి సమస్యలకు సోంపు ఉపశమనం కలిగిస్తుంది. సోంపు నమలడం వల్ల నోటి దుర్వాసన తొలగిపోతుంది. ఇది యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది నోటి దుర్వాసనను పోగొట్టి చిగుళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.