- Telugu News Photo Gallery Expiry date of toothbrush, Know how many days we can use toothbrush in Telugu
Toothbrush: బ్రష్షేగా.. మనల్ని ఏం చేస్తుందిలే అనుకునేరు.. ఎక్కువ కాలం ఉపయోగిస్తే షెడ్డుకు వెళ్లడం గ్యారెంటీ..!
ఉదయాన్నే లేవగానే బ్రష్ చేస్తాం.. ఇదంతా మామూలే అనుకున్నా.. ఇక్కడ మేం చెప్పబోయే ఓ విషయం గమనించాలి.. మీరు మీ దంతాలను శుభ్రపరచడానికి చాలా కాలం పాటు అదే టూత్ బ్రష్‌ను ఉపయోగిస్తే, అది ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని వ్యాప్తి చేస్తుంది..
Updated on: Aug 18, 2024 | 11:40 AM

వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యం.. అందుకే.. ప్రతిరోజూ బ్రష్ చేయడం.. శుభ్రంగా స్నానం.. మంచి దుస్తులు ధరించడం ఇవన్నీ మనలో భాగం..అయితే.. ఉదయాన్నే లేవగానే బ్రష్ చేస్తాం.. ఇదంతా మామూలే అనుకున్నా.. ఇక్కడ మేం చెప్పబోయే ఓ విషయం గమనించాలి.. మీరు మీ దంతాలను శుభ్రపరచడానికి చాలా కాలం పాటు అదే టూత్ బ్రష్‌ను ఉపయోగిస్తే, అది ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని వ్యాప్తి చేస్తుంది.. ఫలితంగా మీరు అనారోగ్యానికి గురవ్వడం ఖాయం అంటున్నారు వైద్య నిపుణులు..

ఒకే టూత్ బ్రష్ ను ఎక్కువ కాలం వాడటం వల్ల అనేక సమస్యలు వస్తాయి. వాస్తవానికి ప్రజలు టూత్ బ్రష్ సహాయంతో పళ్లను పూర్తిగా శుభ్రం చేసుకుంటారు.. అయితే టూత్ బ్రష్ ఎప్పటివరకు ఉపయోగించాలి.. రోజూ ఎన్నిసార్లు, ఎంతసేపు దంతాలు శుభ్రపరుచుకోవాలి.. అనే విషయాలు మీకు తెలుసా? తెలియకపోతే ఈ విషయాలను తెలుసుకోండి..

సాధారణంగా వ్యక్తులు ప్రతి మూడు నుండి నాలుగు నెలలకు ఒకసారి టూత్ బ్రష్‌ను మారుస్తారు.. కానీ కొన్ని సందర్భాల్లో మీరు దానిని ఒకటి లేదా రెండు నెలల్లోనే మార్చాలి. ఎక్కువ కాలం టూత్ బ్రష్ వాడితే బ్రష్ మీద బ్యాక్టీరియా పేరుకుపోయి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

ఇంకా టూత్ బ్రష్‌ని ఎక్కువ కాలం ఉపయోగించడం వల్ల బ్రిస్టల్స్ పాడైపోయి దంతాలు రక్తస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది.. చెడు బ్రష్ కారణంగా, దంతాల ఎనామిల్ దెబ్బతింటుంది.. చిగుళ్ళలో వాపు ప్రారంభమవుతుంది..

టూత్ బ్రష్ చెడుగా కనిపిస్తే వెంటనే మార్చాలి.. సాధారణంగా 2 నెలల్లో బ్రష్ ను మార్చడం మంచిది.. ఇంకా మీరు అనారోగ్యానికి గురైనప్పుడు.. అంటే.. జ్వరం వచ్చినప్పుడు.. పూర్తిగా తగ్గిన తర్వాత బ్రష్ మార్చడం మంచిది.. రోజుకు 2 సార్లు.. అంటే ఉదయం, సాయంత్రం వేళ బ్రష్ చేసుకోవాలి.. 2 నుంచి 4 నిమిషాల పాటు మంచి టూత్ పేస్ట్‌తో బ్రష్ చేయడం మంచిది..

మీరు టూత్ బ్రష్‌ను కొనుగోలు చేసినప్పుడల్లా, మృదువైన లేదా మధ్యస్థ ముళ్ళతో (స్మూత్ అండ్ మీడియం బ్రష్) కూడిన బ్రష్‌ను కొనుగోలు చేయండి. మీ నోటి పరిమాణాన్ని బట్టి టూత్ బ్రష్‌ను ఎంచుకోండి. మీ దంతాలలో సమస్యలు ఉంటే, దంతవైద్యుడిని సంప్రదించండి.




