- Telugu News Photo Gallery Experts say that there are health side effects of sleeping with the phone next to it at night
రాత్రి పూట ఫోన్ పక్కన పెట్టుకుని నిద్ర పోతున్నారా.. డేంజర్ జోన్ లో ఉన్నట్లే..
ఎప్పుడైతే ఆండ్రాయిడ్ ఫోన్లు చేతిలోకి వచ్చాయో అప్పటి నుంచి కంటి నిండా నిద్ర గగనమైపోయింది. అర్ధరాత్రి వరకు ఫోన్ బ్రౌజింగ్ చేస్తూనే ఉంటున్నారు. మరికొంతమంది ఓటీటీలో వెబ్ సిరీస్ చూస్తూ ఉంటారు.
Updated on: Dec 03, 2022 | 12:59 PM

ఎప్పుడైతే ఆండ్రాయిడ్ ఫోన్లు చేతిలోకి వచ్చాయో అప్పటి నుంచి కంటి నిండా నిద్ర గగనమైపోయింది. అర్ధరాత్రి వరకు ఫోన్ బ్రౌజింగ్ చేస్తూనే ఉంటున్నారు. మరికొంతమంది ఓటీటీలో వెబ్ సిరీస్ చూస్తూ ఉంటారు. కొందరైతే సమయపాలన పాటించకుండా ల్యాప్‌టాప్‌లో వర్క్ చేస్తారు. ఇలా రాత్రి పడుకునే ముందు స్క్రీన్‌కు అతుక్కుపోతే ఎన్నో ఆరోగ్య సమస్యలు దరిచేరాతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ప్రతి ఒక్కరికి వేర్వేరు నిద్ర అలవాట్లు ఉంటాయి. కొందరికి లైట్ వేస్తే నిద్ర పట్టదు, గది అంతా చీకటిగా ఉండాలి. కొంతమందికి చలికాలంలో కూడా ఫ్యాన్ లేకుండా నిద్ర పట్టదు. ఇంకొందరు వేసవిలో కూడా దుప్పట్లు కప్పుకొని నిద్రపోతారు. అయితే ఎవరి అలవాట్లు ఎలా ఉన్నప్పటికీ, రాత్రి పడుకునే ముందు టీవీ, మొబైల్ ఫోన్స్, ల్యాప్‌టాప్ వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఉపయోగించే వారికి నిద్ర సమస్యలు వస్తాయి


టీవీ ద్వారా వెలువడే నీలి కాంతి ఆరోగ్యానికి హానికరం. బ్లూ లైట్ వివిధ రకాల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. మొబైల్ ఫోన్‌లు హానికరమైన రేడియేషన్‌ను విడుదల చేస్తాయి. ఇవి మన మెదడును దెబ్బతీస్తుంది. ఇది తలనొప్పి, కండరాల నొప్పులు, ఇతర ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. రాత్రిపూట టీవీ లేదా ల్యాప్‌టాప్‌ని వాడుతూ నిద్రపోయే వారికి బ్రెస్ట్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

టీవీ నుండి వచ్చే నీలి కిరణాలు నిద్ర తర్వాత కూడా మెదడును అలర్ట్ మోడ్‌లో ఉంచుతాయి. రాత్రిపూట ఎలక్ట్రానిక్ పరికరాలను ఎక్కువగా ఉపయోగించే వ్యక్తులు మిగగా వారికంటే ఎక్కువగా డిప్రెషన్‌కు గురవుతారు. దీని వల్ల మెదడుకు తగినంత విశ్రాంతి లభించదు, బాగా అలసిపోతుంది.

రాత్రి పూట నిద్రపోయే ముందు ఎన్‌టర్‌టైన్మెంట్ పేరుతో ఫోన్‌తో కాలక్షేపం చేస్తున్నారు. ఇలా చేస్తే ఎన్నో అరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. రాత్రి మీరు పడుకునే సమయం కంటే ఓ అరగంట ముందు స్మార్ట్ ఫోన్‌ను పూర్తిగా పక్కన పెట్టేయండి.. నోటిఫికేషన్లు ఆఫ్ చేసేయండి. చక్కగా నిద్రపోండి..



