- Telugu News Photo Gallery Technology photos Oneplus launching new smartphone oneplus nord ce3 features and price Telugu Tech News
OnePlus Nord CE 3: వన్‌ప్లస్ నుంచి మరో బడ్జెట్ ఫోన్.. తక్కువ ధరలో 108 మెగాపిక్సెల్ కెమెరా..
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ భారత మార్కెట్లోకి మరో బడ్జెట్ ఫోన్‌ను లాంచ్ చేయనుంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 పేరుతో తీసుకురానున్న ఈ ఫోన్‌ను వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు. ఈ ఫోన్‌లో ఉండనున్న ఫీచర్లపై ఓ లుక్కేయండి..
Updated on: Dec 03, 2022 | 12:29 PM

చైనాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం వన్‌ప్లస్ ఇటీవల బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ వరుసగా స్మార్ట్ ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోంది. ఓవైపు ప్రీమియం ఫోన్‌లను విడుదల చేస్తూనే మరోవైపు బడ్జెట్ ఫోన్‌లను తీసుకొస్తోంది.

ఈ నేపథ్యంలోనే తాజాగా వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ2కి కొనసాగింపుగా వచ్చే ఏడాదిలో ఈ కొత్త ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు. ఇదిలా ఉంటే ఈ ఫోన్‌కు సంబంధించిన ఇక అధికారిక ప్రకటన రాకముందే ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.

వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో బ్లాక్ ఫినిష్‌తో కూడిన హోల్ పంచ్ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. వన్‌ప్లస్ ఎక్స్‌ను డిజైన్ ఆధారంగా వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 డిజైన్ ఉంటుందని సమాచారం.

ఈ ఫోన్ 6.7 ఇంచెస్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్‌తో రానుందని అంచనా. ఇక ఇందులో 67 డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇవ్వనున్నారని తెలుస్తోంది.

ఇందులో కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. ఇందులో 108 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు సెల్పీల కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇవ్వనున్నట్లు సమాచారం. ధర విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్ రూ. 25000గా ఉండనున్నట్లు తెలుస్తోంది.




