- Telugu News Photo Gallery Experts say that making cauliflower leaves a part of the diet has many health benefits
Cauliflower Leaves: కాలీఫ్లవర్ ఆకులను పడేస్తున్నారా.. అయితే ఈ ఇంట్రెస్టింగ్ హెల్త్ బెనెఫిట్స్ మీ కోసం..
కాలీఫ్లవర్ శీతాకాలంలో విరివిగా దొరికే సీజనల్ వెజిటేబుల్. దీంతో కాలీఫ్లవర్ పరాటాలు, బజ్జీలు, పచ్చళ్లు కూడా చేస్తుంటారు. అయితే చాలామంది తెల్లటి భాగాన్ని మాత్రమే తినేందుకు ఇష్టపడతారు. అయితే దీని ఆకులు, వేర్లు కూడా అత్యధిక పోషకాలను కలిగి ఉన్నాయని మీకు తెలుసా?......
Updated on: Feb 11, 2023 | 8:53 PM

కాలీఫ్లవర్ ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో పుష్కలమైన ఐరన్, కాల్షియంతో పాటు ఫ్లవర్ కంటే రెండు రెట్లు ఎక్కువ ప్రోటీన్, ఫైబర్, ఫాస్పరస్, మూడు రెట్లు ఎక్కువ ఖనిజాలను కలిగి ఉంటాయి. దీన్ని రెగ్యులర్ వినియోగం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి.

శరీరం జీర్ణ శక్తిని అభివృద్ధి చేయడంలో, ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకమైన పాత్రను పోషిస్తాయి. 100 గ్రాముల కాలీఫ్లవర్ ఆకుల్లో 600 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. డైరీ ప్రొడక్ట్స్ అంటే అలర్జీ ఉన్నవారు క్యాలీఫ్లవర్ ఆకులను ఆహారంలో చేర్చుకుంటే శరీరంలోని కాల్షియం బ్యాలెన్స్ అవుతుంది.

క్యాలీఫ్లవర్ వండుకుని తింటారు. కానీ కోసే ముందు దాని ఆకులు మాత్రం తీసి బయట పడేస్తారు. నిజానికి క్యాలీఫ్లవర్ ఆకుల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. కాలీఫ్లవర్ ఆకులతో కళ్లకు మేలు చేస్తుంది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ప్రకారం, కాలీఫ్లవర్ ఆకుల్లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది.

ఈ ఆకులలో తక్కువ మొత్తంలో కార్బోహైడ్రేట్లతో పాటు అధిక ప్రొటీన్లు, ఫైబర్ ఉంటాయి. కాబట్టి దీని వినియోగం రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే, మీరు దానిని వివిధ మార్గాల్లో ఆహారంలో చేర్చుకోవచ్చు.

ఒక పరిశోధన ప్రకారం, కాలీఫ్లవర్ ఆకులు ప్రోటీన్, ఖనిజాలకు మంచి మూలం. ఇవి పిల్లల పెరుగుదల, అభివృద్ధికి అవసరమైనవి. పుల్లటి ఆకులను రోజూ తీసుకోవడం వల్ల పోషకాహార లోపం ఉన్న పిల్లలకు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.



