- Telugu News Photo Gallery Employees Protestes wearing helmets in Boath Tehsildar office of Adilabad district
Telangana:హెల్మెట్ వేసుకుని విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు.. ఇంతకు విషయం ఏంటంటే..
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ కారాల్యయాలకు జబ్బు చేసింది. ఏ నిమిషంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. పెచ్చులూడుతూ, గోడల నుంచి చెట్లు పెరిగి గోడలు బీటలు వారుతున్నాయి. బోథ్ తహసీల్దార్ కార్యాలయం పరిస్థితి మరింత దారుణంగా మారింది. శిథిలావస్థకు చేరిన కార్యాలయాల్లో విధులు నిర్వహించాలంటే సిబ్బంది భయంతో వణికిపోతున్నారు. ప్రస్థుత పరిస్థితికి అద్దం పట్టేలా స్థానికులు, ఉద్యోగులు వినూత్న తరహాలో నిరసన వ్యక్తం చేశారు.
Updated on: Jul 24, 2023 | 7:24 PM

ఆదిలాబాద్ జిల్లా బోథ్ తహసిల్దార్ కార్యాలయంలో ఉద్యోగులు వినూత్న నిరసన చేపట్టారు. కాలం చెల్లిన తహసిల్దార్ కార్యాలయంలో బిక్కు బిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నాం.. ఎప్పుడు ఏ పెచ్చు ఊడి నెత్తిన పడుతుందో అంటూ ఆందోళన చెందుతున్నాం..

ఇకనైనా కొత్త కార్యాలయాన్ని నిర్మించండి.. ఈ వానకాలం ప్రాణాలు కాపాడండి మహా ప్రభో అంటూ హెల్మెట్లు ధరించి వినూత్న నిరసన తెలిపారు సిబ్బంది.

స్థానికులు సైతం హెల్మెట్ లు ధరించి పనుల నిమిత్తం తహసీల్దారు కార్యాలయానికి రావడం కనిపించింది.

మరో వైపు బోథ్ ను రెవెన్యూ డివిజన్ గా మార్చాలంటూ ఆందోళన చేస్తున్న రెవెన్యూ డివిజన్ సాధన సమితి సభ్యులు పెద్ద ఎత్తున హెల్మెట్లు ధరించి తహసీల్దారు కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు.

శిథిలావస్థలో ఉన్న ఈ తహాసిల్దార్ కార్యాలయాన్ని కూల్చివేసి నూతన భవనాన్ని నిర్మించాలని నిరసన తెలిపారు.

నిజాం కాలంలో నిర్మించిన కార్యాలయం శిథిలావస్థకు చేరి నిత్ పెచ్చులు ఊడి పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు కార్యాలయం లో పని చేస్తున్న సిబ్బంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నామని సిబ్బంది తెలిపారు.