Basha Shek |
Updated on: Jul 24, 2023 | 9:20 PM
అనికా సురేంద్రన్ చైల్డ్ ఆర్టిస్టుగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. విశ్వాసం సినిమాలో అజిత్ కూతురిగా నటించిన ఆమె ఆ తర్వాత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.
బుట్టబొమ్మ' సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులను పలకరించిందీ ముద్దుగుమ్మ. సినిమా హిట్ కాకపోయినా అనిఖా అందానికి, క్యూట్‌నెస్‌కు కుర్రకారు ఫిదా అయ్యింది.
అంతకుముందు నాగార్జున నటించిన ఘోస్ట్ సినిమాలోనూ కీ రోల్‌లో మెరిసింది అనిఖా. దీంతో తెలుగు ప్రేక్షకులకు ఈ అమ్మడు బాగా చేరువైంది.
ఇక సోషల్ మీడియాలోనూ అనిఖా సురేంద్రన్ కు సూపర్ క్రేజ్ ఉంది. తన బ్యూటిఫుల్ అండ్ గ్లామరస్ ఫొటోస్, వీడియోలను తరచూ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తుంటుంది.
తాజాగా వైట్ డ్రెస్‌లో పాలరాతి శిల్పంలా కనిపించింది అనిఖా సురేంద్రన్. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. బుట్టబొమ్మలా ఉందంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.