- Telugu News Photo Gallery Business photos Do you know the top sunroof cars available in the market?Do you know the price?
SUV Cars with Sunroof: మార్కెట్‌లో లభ్యమయ్యే సన్‌రూఫ్ కార్స్‌లో టాప్ ఇవే… ధరెంతో తెలుసా?
ప్రస్తుతం ఇండియన్ ఆటోమోటివ్ మార్కెట్లో సన్‌రూఫ్‌లు ఇప్పుడు సర్వసాధారణమైపోయాయి. చాలా మంది కస్టమర్‌లు ఇప్పుడు పెద్ద, విశాలమైన సన్‌రూఫ్‌తో కూడిన కార్లను ఎంచుకుంటున్నారు. ఎందుకంటే ఇది కారులోకి మరింత కాంతిని అనుమతిస్తుంది, క్యాబిన్‌కు ప్రీమియం అనుభూతిని ఇస్తుంది. కాబట్టి భారతదేశంలో అందుబాటులో ధరల్లో ఉన్న ప్రీమియం ఎస్‌యూవీలపై ఓ లుక్కేద్దాం.
Updated on: Jul 24, 2023 | 7:02 PM

హ్యుందాయ్ క్రెటా మిడ్-స్పెక్ ఎస్ ప్లస్ నైట్ ఎడిషన్ ట్రిమ్ నుంచి పొందుతుంది. ఇది 115 హెచ్‌పీ, 144 ఎన్‌ఎం, 1.5 లీటర్, పెట్రోల్ ఇంజన్ లేదా 116 హెచ్‌పీ, 250 ఎన్‌ఎం, 1. -లీటర్, డీజిల్ ఇంజన్‌తో వస్తుంది. రెండూ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ ఎస్‌యూవీ పనోరమిక్ సన్‌రూఫ్ చాలా మంది కస్టమర్‌లను క్రెటా వైపు ఆకర్షిస్తుంది. ఈ కార్ ధర రూ.13.96 లక్షల నుంచి రూ.19.20 వరకూ ఉంటుంది.

కియా సెల్టోస్ కారు హెచ్‌టీకే ప్లస్ ట్రిమ్ నుంచి పనోరమిక్ సన్‌రూఫ్‌తో వస్తుంది. ఈ కారు టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. హెచ్‌టీఎక్స్ నుంచి ఫేస్‌లిఫ్ట్ అన్ని వేరియంట్‌లలో ప్రామాణికంగా పనోరమిక్ సన్‌రూఫ్ వస్తుంది. 115 హెచ్‌పీ, 144 ఎన్‌ఎం, 1.5 లీటర్, పెట్రోల్ ఇంజన్, 116 హెచ్‌సీ, 250 ఎన్‌ఎం, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్, 160 హెచ్‌పీ, 253 ఎన్‌ఎం, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఈ ఇంజన్‌లన్నీ 6-స్పీడ్ మాన్యువల్ పని చేస్తుంది. ఈ కారు ధర రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకూ ఉంటుంది.

ఎంజీ ఆస్టర్ ఎంజీ మిడ్-స్పెక్ స్మార్ట్ ట్రిమ్ నుంచి ఆస్టర్‌లో పనోరమిక్ సన్‌రూఫ్‌ను అందిస్తుంది. ఆస్టర్ 110హెచ్‌పీ, 144 ఎన్‌ఎం 1.5 లీటర్, పెట్రోల్ ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా సీవీటీతో వస్తుంది. ఈ కారు ఎరుపు రంగు ఇంటీరియర్‌తో పాటు పనోరమిక్ సన్‌రూఫ్ క్యాబిన్ ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ కారు ధర రూ.14.21 లక్షల నుంచి రూ.18.69 లక్షలుగా ఉంటుంది. ఆస్టర్ కారు బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు.

మారుతి సుజుకి గ్రాండ్ విటారాతో మధ్యతరహా ఎస్‌యూవీ సెగ్మెంట్‌లోకి ప్రవేశిస్తుంది. ఈ కారులో పనోరమిక్ సన్‌రూఫ్‌తో వస్తుంది. ఈ కారులో ఆల్ఫా పెట్రోల్ ట్రిమ్, బలమైన-హైబ్రిడ్ పవర్‌టరైన్ వంటి రెండు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంటుంది. భారీ సన్‌రూఫ్ క్యాబిన్‌ను మరింత కాంతితో ఉంటుంది. గ్రాండ్ విటారా 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ కారు ధర రూ.16.04 లక్షల నుంచి రూ.19.9 లక్షల వరకూ ఉంటుంది.




