- Telugu News Photo Gallery Business photos PM Kisan Yojana 14th installment to be released on this date: How to check status details
PM Kisan: అన్నదాతలకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు జమవుతాయంటే..?
PM-KISAN 14th Installment: చిన్న సన్నకారు రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నో్ పథకాలను అమలు చేస్తోంది. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రూ.6 వేలను ప్రతీ ఏటా ఇస్తోంది. వీటిని మూడు విడతల్లో రూ.2వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమచేస్తోంది.
Updated on: Jul 25, 2023 | 11:18 AM

PM-KISAN 14th Installment: చిన్న సన్నకారు రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నో్ పథకాలను అమలు చేస్తోంది. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రూ.6 వేలను ప్రతీ ఏటా ఇస్తోంది. వీటిని మూడు విడతల్లో రూ.2వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమచేస్తోంది.

ఇప్పటివరకు 13 విడతల నగదును కేంద్రం రైతులకు అందించింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 14వ విడతను మరో రెండు రోజుల్లో విడుదల చేయనుంది. పిఎం కిసాన్ పథకం కింద సుమారు 8.5 కోట్ల మంది లబ్ధిదారులకు పిఎం నరేంద్ర మోడీ జూలై 27న పంపిణీ చేస్తారని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు.

జూలై 27న, రాజస్థాన్‌లోని సికార్‌లో ఉదయం 11 గంటలకు అర్హత కలిగిన రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ నగదును జమచేయనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రైతులతో సమావేశమవుతారు. అదేరోజు అర్హులైన ఖాతాల్లో డబ్బు జమకానుంది.

ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ప్రయోజనం పొందాలనుకునే రైతులు తమ బ్యాంక్ ఖాతాను వారి ఆధార్ కార్డుతో లింక్ చేయాలి.. PM కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలతో e-KYCని సమర్పించాలి. మరిన్ని వివరాల కోసం http://pmkisan.gov.in వెబ్సైట్ ను సందర్శించండి.

పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఏదైనా సమస్య ఉంటే హెల్ప్‌లైన్ నెంబర్ 155261 లేదా 1800115526 లేదా 011-23381092కు సంప్రదించాలి. pmkisan-ict@gov.in కు మెయిల్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు