- Telugu News Photo Gallery Easy Weight Loss Tips In Telugu: Ways To Consume Carom Seeds For Quick Weight Loss
Ajwain for Weight Loss: బరువు తగ్గాలంటే జిమ్‌లో కసరత్తులు చేయాల్సిన అవసరం లేదు..? ఈ ఒక్క ట్రిక్ పాటిస్తే చాలు..
నేటి కాలంలో అనేక మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. బరువు పెరగడానికి ప్రధాన కారణం నిరంతరం కూర్చోవడం, వ్యాయామం, నడకకు దూరంగా ఉండటం. దీంతో కొవ్వు కడుపులో పేరుకుపోతుంది. అయితే వేగంగా బరువు తగ్గాలనుకునే వారు తక్కువ కేలరీల ఆహారం, నిత్యం వ్యాయామం చేయడం చాలా అవసరం. అలాగే వంటగదిలో దొరికే ఈ మసాలా దినుసువల్ల కూడా సులభంగా బరువు తగ్గొచ్చు. దీంతో శరీరం ఫిట్‌గా ఉండటంతోపాటు బరువు కూడా అదుపులో ఉంటుంది..
Updated on: Jan 22, 2024 | 2:03 PM

నేటి కాలంలో అనేక మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. బరువు పెరగడానికి ప్రధాన కారణం నిరంతరం కూర్చోవడం, వ్యాయామం, నడకకు దూరంగా ఉండటం. దీంతో కొవ్వు కడుపులో పేరుకుపోతుంది. అయితే వేగంగా బరువు తగ్గాలనుకునే వారు తక్కువ కేలరీల ఆహారం, నిత్యం వ్యాయామం చేయడం చాలా అవసరం. అలాగే వంటగదిలో దొరికే ఈ మసాలా దినుసువల్ల కూడా సులభంగా బరువు తగ్గొచ్చు.

దీంతో శరీరం ఫిట్‌గా ఉండటంతోపాటు బరువు కూడా అదుపులో ఉంటుంది. ప్రతి వంటగదిలో వాము ఉంటుంది. ఇది గ్యాస్, కడుపునొప్పి, అజీర్ణం వంటి సమస్యలను పారదోలడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. పొట్ట చుట్టూ ఉండే కొవ్వును తొలగించడంలోనూ వాము ఉపయోగపడుతుంది. అంతేకాకుండా వాము అనేక కడుపు సంబంధిత వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.

ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి వాము ప్రభావవంతంగా పనిచేస్తుంది. వాములో థైమోల్ అనే పదార్థం ఉంటుంది. ఇది జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది. జీవక్రియ పెరిగినప్పుడు, శరీరంలో కొత్త కొవ్వు ఉత్పత్తి కాదు. ఫలితంగా బరువు తగ్గడం మొదలవుతుంది.

వాములో ఫైబర్, విటమిన్లు, ఇతర పోషకాలు ఉంటాయి. అలాగే వాములో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. గ్రాసుడు నీల్లలో వాము వేసి బాగా మరిగించి ప్రతి రోజూ ఉదయం తాగితే కొవ్వు ఇట్టే కరిగిపోతుంది. శరీరంలో వాపులను తగ్గించడంలోనూ వాము సహాయపడుతుంది.

రక్తపోటును నియంత్రించడంలో కూడా వాము ఉపయోగపడుతుంది. వాములో పొటాషియం అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. పొటాషియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. దీర్ఘకాలంగా జీర్ణ సమస్యలతో బాధపడేవారు వేడినీళ్లలో వాము వేసి మరిగించి తాగాలి. చక్కగా జీర్ణం అవుతుంది.




