AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cancer Signs: శరీరంలోని ఈ 5 భాగాల్లో నొప్పిని విస్మరించవద్దు.. నిర్లక్షం ఖరీదు ప్రాణాలు కావొచ్చు..

ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ వ్యాధి బాధితుల సంఖ్యలో పెరిగిపోతుంది. ముఖ్యంగా పేద, మధ్య-ఆదాయ దేశాలలో ఈ క్యాన్సర్ వ్యాధి పెరిగిపోతుంది. క్యాన్సర్ అనేది శరీరంలోని ఏ భాగంలోనైనా సంభవించే తీవ్రమైన వ్యాధి. అయితే శరీరం కొన్ని ముందస్తు సంకేతాలను (క్యాన్సర్ హెచ్చరిక సంకేతాలు) ఇస్తుంది. వీటిపై శ్రద్ధ చూపడం ద్వారా క్యాన్సర్‌ను సకాలంలో గుర్తించవచ్చు. శరీరంలోని కొన్ని భాగాలలో నొప్పి కూడా క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు.

Surya Kala
|

Updated on: Jul 13, 2025 | 12:27 PM

Share
క్యాన్సర్ ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్సతో నయం చేయవచ్చు. జీవనశైలి మార్పులు, అవగాహన, నివారణ చర్యల ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. దీంతో మనుగడ అవకాశాలు కూడా పెరుగుతాయి. అయితే చాలా సందర్భాలలో క్యాన్సర్ చాలా ఆలస్యంగా గుర్తించబడుతుంది. దీంతో క్యాన్సర్ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. అయితే మన శరీరం ప్రారంభంలోనే క్యాన్సర్ కి సంబంధించిన  కొన్ని సంకేతాలను కూడా ఇస్తుంది (క్యాన్సర్ ఎర్లీ సిగ్నల్స్). అయితే వీటిని సర్వసాధారణంగా భావించి విస్మరిస్తున్నారు. చాలా సార్లు క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు సాధారణ నొప్పి లేదా అసౌకర్యం లాగా కనిపిస్తాయి. శరీరంలోని కొన్ని భాగాలలో నిరంతర నొప్పి ఉంటే.. అది క్యాన్సర్ సంకేతం కావచ్చు. శరీరంలో ఈ ఐదు భాగాలలో కనిపించే నొప్పిని విస్మరించవద్దు.

క్యాన్సర్ ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్సతో నయం చేయవచ్చు. జీవనశైలి మార్పులు, అవగాహన, నివారణ చర్యల ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. దీంతో మనుగడ అవకాశాలు కూడా పెరుగుతాయి. అయితే చాలా సందర్భాలలో క్యాన్సర్ చాలా ఆలస్యంగా గుర్తించబడుతుంది. దీంతో క్యాన్సర్ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. అయితే మన శరీరం ప్రారంభంలోనే క్యాన్సర్ కి సంబంధించిన కొన్ని సంకేతాలను కూడా ఇస్తుంది (క్యాన్సర్ ఎర్లీ సిగ్నల్స్). అయితే వీటిని సర్వసాధారణంగా భావించి విస్మరిస్తున్నారు. చాలా సార్లు క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు సాధారణ నొప్పి లేదా అసౌకర్యం లాగా కనిపిస్తాయి. శరీరంలోని కొన్ని భాగాలలో నిరంతర నొప్పి ఉంటే.. అది క్యాన్సర్ సంకేతం కావచ్చు. శరీరంలో ఈ ఐదు భాగాలలో కనిపించే నొప్పిని విస్మరించవద్దు.

1 / 6
కడుపు నొప్పి
కడుపులో నిరంతర నొప్పి లేదా కడుపులో అసౌకర్యం ఉంటే గ్యాస్ట్రిక్ క్యాన్సర్, కాలేయ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు. కడుపు నొప్పి, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, వాంతులు లేదా మలంలో రక్తం వంటి లక్షణాలతో కూడి ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

కడుపు నొప్పి కడుపులో నిరంతర నొప్పి లేదా కడుపులో అసౌకర్యం ఉంటే గ్యాస్ట్రిక్ క్యాన్సర్, కాలేయ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు. కడుపు నొప్పి, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, వాంతులు లేదా మలంలో రక్తం వంటి లక్షణాలతో కూడి ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

2 / 6
ఎముకలు లేదా కీళ్లలో నొప్పి
ముఖ్యంగా రాత్రి సమయంలో ఎక్కువగా ఎముక నొప్పి ఉంటే ఎముక క్యాన్సర్ (ఆస్టియోసార్కోమా) లేదా మెటాస్టాటిక్ క్యాన్సర్ (శరీరంలోని ఇతర భాగాల నుంచి ఎముకలకు క్యాన్సర్ వ్యాపించినప్పుడు) సంకేతం కావచ్చు. విశ్రాంతి తీసుకున్న తర్వాత కూడా నొప్పి తగ్గకపోయినా మందులు ఉపశమనం కలిగించకపోయినా ఖచ్చితంగా వైద్యుడి వద్దకు వెళ్ళాల్సిందే.

ఎముకలు లేదా కీళ్లలో నొప్పి ముఖ్యంగా రాత్రి సమయంలో ఎక్కువగా ఎముక నొప్పి ఉంటే ఎముక క్యాన్సర్ (ఆస్టియోసార్కోమా) లేదా మెటాస్టాటిక్ క్యాన్సర్ (శరీరంలోని ఇతర భాగాల నుంచి ఎముకలకు క్యాన్సర్ వ్యాపించినప్పుడు) సంకేతం కావచ్చు. విశ్రాంతి తీసుకున్న తర్వాత కూడా నొప్పి తగ్గకపోయినా మందులు ఉపశమనం కలిగించకపోయినా ఖచ్చితంగా వైద్యుడి వద్దకు వెళ్ళాల్సిందే.

3 / 6
తరచుగా తలనొప్పి
ముఖ్యంగా ఉదయం సమయంలో నిరంతరం తీవ్రమైన తలనొప్పి వస్తే.. అది బ్రెయిన్ ట్యూమర్ లేదా క్యాన్సర్ లక్షణం కావచ్చు. తలనొప్పి వాంతులు, మూర్ఛ,  జ్ఞాపకశక్తి కోల్పోవడం  లేదా దృష్టిలో మార్పులు వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

తరచుగా తలనొప్పి ముఖ్యంగా ఉదయం సమయంలో నిరంతరం తీవ్రమైన తలనొప్పి వస్తే.. అది బ్రెయిన్ ట్యూమర్ లేదా క్యాన్సర్ లక్షణం కావచ్చు. తలనొప్పి వాంతులు, మూర్ఛ, జ్ఞాపకశక్తి కోల్పోవడం లేదా దృష్టిలో మార్పులు వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

4 / 6

పొత్తి కడుపులో నొప్పి
మహిళల్లో పొత్తి కడుపు నొప్పి అండాశయ క్యాన్సర్ లేదా గర్భాశయ క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు. పురుషులలో, ప్రోస్టేట్ క్యాన్సర్ లేదా కొలొరెక్టల్ క్యాన్సర్ కూడా ఈ రకమైన నొప్పికి కారణం కావచ్చు. నొప్పితో పాటు మూత్ర విసర్జనలో ఇబ్బంది, సక్రమంగా లేని ఋతుస్రావం లేదా అపానవాయువు వంటి లక్షణాలు ఉంటే ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించండి.

పొత్తి కడుపులో నొప్పి మహిళల్లో పొత్తి కడుపు నొప్పి అండాశయ క్యాన్సర్ లేదా గర్భాశయ క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు. పురుషులలో, ప్రోస్టేట్ క్యాన్సర్ లేదా కొలొరెక్టల్ క్యాన్సర్ కూడా ఈ రకమైన నొప్పికి కారణం కావచ్చు. నొప్పితో పాటు మూత్ర విసర్జనలో ఇబ్బంది, సక్రమంగా లేని ఋతుస్రావం లేదా అపానవాయువు వంటి లక్షణాలు ఉంటే ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించండి.

5 / 6
వెన్నునొప్పి
వెన్నునొప్పి సాధారణంగా కండరాల ఒత్తిడి లేదా వెన్నెముక సంబంధిత సమస్యల వల్ల వస్తుంది. అయితే నిరంతరంగా వెన్ను నొప్పి ఉంటే.. అది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్ లేదా వెన్నెముక కణితికి సంకేతం కూడా కావచ్చు. విశ్రాంతి తర్వాత కూడా నొప్పి తగ్గకపోయినా, రాత్రి సమయంలో ఎక్కువ అయినా వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

వెన్నునొప్పి వెన్నునొప్పి సాధారణంగా కండరాల ఒత్తిడి లేదా వెన్నెముక సంబంధిత సమస్యల వల్ల వస్తుంది. అయితే నిరంతరంగా వెన్ను నొప్పి ఉంటే.. అది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్ లేదా వెన్నెముక కణితికి సంకేతం కూడా కావచ్చు. విశ్రాంతి తర్వాత కూడా నొప్పి తగ్గకపోయినా, రాత్రి సమయంలో ఎక్కువ అయినా వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

6 / 6