AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Goddesses Temples in India: నవరాత్రి ఉత్సవవాలు ఘనంగా జరిగే పురాతనమైన ప్రసిద్ధి చెందిన అమ్మవారి ఆలయాలు..

Goddesses Temples in India: హిందూమతం లో స్త్రీ శక్తి స్వరూపిణి కీర్తిస్తారు. అమ్మవారిని ఆదిశక్తి భావించి పూజిస్తారు. ఇక ఈ శరన్నవరాత్రుల్లో పార్వతీదేవిని రకరకాల అలంకారాల్లో భక్తులు పూజిస్తారు. తొమ్మిది రోజుల పాటు జరిగే దేవి నవరాత్రి ఉత్సవాల్లో మనదేశంలో ప్రసిద్ధ పురాతన అమ్మవారి ఆలయాల గురించి తెలుసుకుందాం..

Surya Kala
|

Updated on: Oct 04, 2021 | 8:54 PM

Share
 భారత దేశంలోని అమ్మవారి పుణ్యక్షేత్రాల్లో ప్రసిద్ధి చెందింది వైష్ణో దేవి ఆలయం.  జమ్ము జిల్లాలోని కాట్ర లో ఎత్తైన హిమాలయ పర్వత ప్రాంతంలోని త్రికూట పర్వత శేణి లో మాతా వైష్ణవి కొలువై ఉంది. ఇక్కడ వైష్ణో దేవి మూడు రూపాల్లొ దర్శనమిస్తుంది.

1 / 9

 అమ్మవారి ఆలయాల్లో మరొక ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో ఒకటి నైనా దేవి టెంపుల్. హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న ఈ దేవాలయాన్ని మహీష్‌పీఠ్ అని పిలుస్తారు. ఇక్కడే మహిషాసురుడిని అమ్మవారు వధించింది అని భక్తుల నమ్మకం

2 / 9
హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా జిల్లాలో ఉన్న జ్వాలా దేవి ఆలయం. ఇక్కడ అమ్మవారు అగ్ని రూపంలో దర్శనమిస్తారు. ఇది 51 శక్తిపీఠాల్లో  ఒకటి. సతీదేవి నాలుక పడిన ప్రదేశంగా భక్తుల విశ్వాసం

3 / 9
అస్సాంలోని గౌహతిలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రం కామాఖ్య దేవి. ఇక్కడ సతీదేవి యోని పడిన ప్రాంతంగా భక్తుల నమ్మకం. 51 శక్తిపీఠాలలో ఒకటి.

4 / 9
కోల్‌కతా లోని హుగ్లీ నది ఒడ్డున ఉన్న ఆలయం దక్షిణేశ్వర్. ఈ ;ఆలయాన్ని 1855 లో కాళీమాత భక్తురాలైన రాణి రష్మోని నిర్మించారు.    కాళీ మాత రూపమైన మా భవతారిణిగా ఇక్కడ అమ్మవారు పూజలను అందుకుంటున్నారు.

5 / 9
కోల్ కతాలోని కలిఘాట్ ప్రాంతంలోని కాళీమాత ఆలయం. ఆలయంలో ఏడాది పొడవునా భక్తులు రద్దీఉంటుంది. సతీదేవి కుడి కాలి బొటనవేలు ఇక్కడ పడిందని భక్తుల నమ్మకం. ఇక్కడ విగ్రహం ప్రత్యేకమైంది. అమ్మవారి విగ్రహంలో నాలుక ముందుకు పొడుచుకువచ్చింది.

6 / 9
తమిళనాడులోని చారిత్రాత్మక నగరమైన మధురైలో వైగై నది ఒడ్డున ఉన్న అమ్మవారి ఆలయం మీనాక్షి అమ్మన్ దేవాలయం. అమ్మవారి  అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇక్కడ అమ్మవారి విగ్రహం తన కుడి చేతిలో చిలుక పట్టుకుని ఉంటుంది.

7 / 9
కేరళలోని తీరప్రాంత నగరమైన కొచ్చి శివారులో లక్ష్మీదేవి ఆలయం  ఉంది. ఇక్కడ అమ్మవారు విభిన్న రూపాల్లో దర్శనమిస్తుంది. ఉదయం మహాసరస్వతి, మధ్యాహ్నం మహాలక్ష్మి , సాయంత్రం మహాకాళిగా భక్తులకు దర్శనమిస్తుంది. మానసిక అనారోగ్యంతో బాధపడేవారు ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే నయం అవుతుందని నమ్మకం

8 / 9
కర్ణాటకలోని హొరనాడు ప్రాంతంలో  భద్రా నది ఒడ్డున ఉన్న అన్నపూర్ణేశ్వరి ఆలయం ఉంది. ఇది శ్రీ క్షేత్ర హోరనాడు దేవాలయంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ విగ్రహాన్ని అగస్త్య ఋషి స్థాపించారని భక్తుల నమ్మకం

9 / 9