- Telugu News Photo Gallery Due to Samasaptaka Raja Yoga, people born under three zodiac signs will have a handful of money
జీవితం అంటే వీరిదేరా బాబు.. సమసప్తక రాజయోగంతో వీరికి డబ్బే డబ్బు!
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలయిక వలన ఎంతో శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడుతుంటాయి. అయితే దీపావళికి 9 రోజుల ముందు సంసప్తక రాజయోగం ఏర్పడింది. ఈ రాజయోగం వలన మూడు రాశుల వారికి ఈ నెల మొత్తం అద్భుతంగా ఉండబోతుందంట. ఇంతకీ ఆ మూడు రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.
Updated on: Oct 16, 2025 | 8:28 AM

కుంభ రాశి : సమసప్తక రాజయోగం సమయంలో కుంభ రాశి వారి సంపాదన పెరుగుతుంది. వీరు ఆర్థికంగా బలవంతులు అవుతారు. చాలా రోజుల నుంచి ఎవరైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో, వారు ఆ సమస్యల నుంచి బయటపడుతారు. విద్యార్థులకు కలిసి వస్తుంది. అనుకోని విధాంగా వీరికి ధనం చేతికందుతుంది. వ్యాపార రంగంలో ఉన్న వారు మంచి ప్రయోజనాలు అందుకుంటారు.

మకర రాశి :మకర రాశి వారికి సమసప్తక రాజయోగం ఏర్పడడం వల్ల అన్నింట్లో శుభ ఫలితాలు కలుగుతాయి. వీరు ఈ సమయంలో కొత్త ఇళ్లతో పాటు భూములు కూడా కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులకు అదృష్టం కలిసి వస్తుంది. ఇంటా బయట ఆనందకర వాతావరణం చోటు చేసుకుంటుంది. అనుకున్న పనులన్నీ సమయానికి పూర్తి చేస్తారు.

మీన రాశి : మీన రాశి వారికి ఈ సమయంలో అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి. మిత్రుల నుంచి ధనలాభం కలుగుతుంది. అనుకోని విధంగా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇవి మీకు అనేక విధాలుగా ప్రయాజనాన్ని చేకూరుస్తాయి. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి.

వృషభ రాశి :వృషభ రాశి వారికి సమసప్తక రాజయోగం సమయంలో శని అనుగ్రహంతో ఆర్థికంగా కలిసి వస్తుంది. గతంలో పెట్టిన పెట్టుబడిల నుంచి డబ్బు కూడా తిరిగి వస్తుంది. కొత్త ఆదాయ వనరులు కూడా ఊహించని స్థాయిలో పెరుగుతాయి. స్థిరాస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఎవరైతే చాలా రోజుల నుంచి విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకుంటారో వారి కోరిక నెరవేరుతుంది. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు.

ముఖ్యంగా కొత్త ఉద్యోగాలు ప్రారంభించే వారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. శని దేవుడు ఆశీస్సులతో కష్టాలన్నీ తొలగిపోతాయి. అలాగే మానసిక ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడుతుంది. వీరికి ఆత్మవిశ్వాసం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది.



