- Telugu News Photo Gallery Doing this on Monday, Tuesday and Friday in the month of Sravana is particularly beneficial, Check Here is Details
Sravana Masam 2024: శ్రావణ మాసంలో సోమ, మంగళ, శుక్రవారాలు ఇలా చేస్తే.. అదృష్టమే అదృష్టం..
శ్రావణ మాసం అంటే చాలా మంది ఎంతో నిష్ఠగా లక్ష్మీ దేవిని పూజిస్తారు. ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చే రెండో వారంలో వర మహా లక్ష్మీ దేవిని పూజించి.. వరాలు పొందుతారు. శ్రావణ మాసం ఈ ఏడాది ఆగష్టు 5వ తేదీ ప్రారంభమైంది. శ్రావణ మాసంలో సోమ, మంగళ, శుక్రవారాలు అత్యంత పవిత్రంగా పూజలు చేస్తారు. ఈ మాసంలో సోమ, మంగళ, శుక్రవారాల్లో చేసే పూజలు ఎంతో మంచి ఫలితాలను ఇస్తుంది. గ్రహ దోషాలను కూడా తొలగిస్తాయి. ఈ మాసంలో శ్రావణ సోమవారాలు..
Updated on: Aug 05, 2024 | 8:28 PM

శ్రావణ మాసం అంటే చాలా మంది ఎంతో నిష్ఠగా లక్ష్మీ దేవిని పూజిస్తారు. ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చే రెండో వారంలో వర మహా లక్ష్మీ దేవిని పూజించి.. వరాలు పొందుతారు. శ్రావణ మాసం ఈ ఏడాది ఆగష్టు 5వ తేదీ ప్రారంభమైంది. శ్రావణ మాసంలో సోమ, మంగళ, శుక్రవారాలు అత్యంత పవిత్రంగా పూజలు చేస్తారు.

ఈ మాసంలో సోమ, మంగళ, శుక్రవారాల్లో చేసే పూజలు ఎంతో మంచి ఫలితాలను ఇస్తుంది. గ్రహ దోషాలను కూడా తొలగిస్తాయి. ఈ మాసంలో శ్రావణ సోమవారాలు.. శివుడికి పంచామృతంతో అభిషేకం చేయడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి. అప్పుల బాధల నుంచి కూడా విముక్తి పొందుతారు.

అదే విధంగా శ్రావణ మంగళ వారం చేయడం వల్ల కూడా విశేషంగా లబ్ధి పొందుతారు. అప్పుల బాధల నుంచి విముక్తి పొందుతారు. ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడతారు. అన్ని పనుల్లో విజయం సాధిస్తారు.

ఇక ఈ మాసంలో వచ్చే శ్రావణ శుక్ర వారాలు చేయడం కూడా చాలా విశేషంగా లాభిస్తుంది. ఆర్థిక సంక్షోభంతో బాధ పడేవారు.. ఆ సమస్యల నుంచి బయట పడతారు. శ్రావణ శుక్రవారం గోవుకు చపాతీలు తినిపించడం వల్ల అశేష ఫలితాలు కలుగుతాయి.

ఈ మాసంలో ఏ రోజు అయినా మీకు కుదిరినప్పుడు గోమాతకు బెల్లం తినిపించడం వల్ల శని దోషం కలుగుతుంది. అదే విధంగా ముఖ్యంగా ఈ మాసంలో మద్యం, మాంసానికి దూరంగా ఉండాలి. ఇతరులను దూషించకూడదు. అదే విధంగా వెల్లుల్లి, ఉల్లిపాయ, ముల్లంగి, బెండకాయ తినకూడదు.





























