- Telugu News Photo Gallery Cricket photos From kl rahul to shivam dube and arshdeep singh these 3 players may drop team india playing 11 3rd odi sl vs ind
SL vs IND: తొలి రెండు ఓటములకు కారణం.. కట్‌చేస్తే.. మూడో వన్డే నుంచి ముగ్గురు ఔట్.. లిస్టులో ఎవరున్నారంటే?
ఆగస్టు 7న కొలంబో వేదికగా శ్రీలంకతో వన్డే సిరీస్‌లో భారత్ చివరిదైన మూడో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ కోసం, టీం ఇండియా ప్లేయింగ్ 11కి సంబంధించి ఖచ్చితంగా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. మొదటి రెండు వన్డేలలో ప్రదర్శన ప్రత్యేకంగా లేని ఆటగాళ్లను మినహాయించవలసి ఉంటుంది. వీరు టీమిండియా ఓటమికి కారణం అయ్యారు.
Updated on: Aug 05, 2024 | 4:58 PM

3 Indian players should drop from 3rd ODI: శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ ఇప్పటివరకు భారత్ అంచనాలకు విరుద్ధంగా సాగింది. యువ ఆటగాళ్లతో కూడిన టీమ్ ఇండియా టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసి శ్రీలంకను క్లీన్‌స్వీప్ చేసి 3-0తో గెలిచింది. అయితే, వన్డే సిరీస్‌లో కీలక ఆటగాళ్లు ఉన్నప్పటికీ భారత్ 0-1తో వెనుకంజలో ఉంది. ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో భారత జట్టు 32 పరుగుల తేడాతో శ్రీలంక చేతిలో ఓడిపోయింది. తొలి వన్డే టై అయింది. ఇలాంటి పరిస్థితుల్లో మూడో వన్డేలో టీమిండియా ఎలాగైనా గెలవాల్సిందే.. లేకుంటే ఓటమితో సిరీస్ కోల్పోవడం ఖాయం.

ఆగస్టు 7న కొలంబో వేదికగా శ్రీలంకతో వన్డే సిరీస్‌లో భారత్ చివరిదైన మూడో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ కోసం, టీం ఇండియా ప్లేయింగ్ 11కి సంబంధించి ఖచ్చితంగా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. మొదటి రెండు వన్డేలలో ప్రదర్శన ప్రత్యేకంగా లేని ఆటగాళ్లను మినహాయించవలసి ఉంటుంది. వీరు టీమిండియా ఓటమికి కారణం అయ్యారు. శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ప్లేయింగ్ 11లో ఎవరికి అవకాశం రాకూడని ముగ్గురు ఆటగాళ్లను ఓసారి చూద్దాం..

3. శివమ్ దూబే: శ్రీలంకతో వన్డే సిరీస్‌కు హార్దిక్ పాండ్యా గైర్హాజరీలో అవకాశం దక్కించుకున్న శివమ్ దూబే చాలా సాధారణ ప్రదర్శన చేశాడు. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు స్పిన్ బౌలర్లపై తన సత్తాను బట్టి భారీ హిట్స్ కొడతాడని అతడి నుంచి ఆశించారు. కానీ, అది జరగలేదు. టీమ్ ఇండియాను విజయానికి చేరువ చేసిన తర్వాత మొదటి వన్డేలో దూబే అవుట్ అయ్యాడు. మ్యాచ్‌ను ముగించలేకపోయాడు. రెండవ వన్డేలో అతను 4 బంతులు మాత్రమే ఆడాడు. కానీ, తన ఖాతా తెరవడంలో విఫలమయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా అతడికి మూడో వన్డే నుంచి నిష్క్రమించే మార్గం చూపాల్సి ఉంటుంది.

2. అర్ష్దీప్ సింగ్: ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ ఇటీవలి కాలంలో టీ20 ఇంటర్నేషనల్స్‌లో అద్భుత ప్రదర్శన చేసినా వన్డే మ్యాచ్‌లలో తన లయను చూపించలేకపోయాడు. శ్రీలంకతో జరిగిన తొలి, రెండో వన్డేలో అర్ష్‌దీప్ సింగ్ చివరి ఓవర్లలో చాలా పరుగులు ఇచ్చాడు. రెండో వన్డేలో అర్ష్‌దీప్‌కు ఒక్క వికెట్ కూడా దక్కలేదు. అతను 9 ఓవర్లలో 58 పరుగులు ఇచ్చాడు. ఇటువంటి పరిస్థితిలో, కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్ గౌతం గంభీర్ ప్లేయింగ్ 11లో బయట కూర్చున్న ఫాస్ట్ బౌలర్లలో ఒకరికి అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది.

1. కేఎల్ రాహుల్: ప్రపంచకప్ ఫైనల్‌లో నెమ్మదిగా ఇన్నింగ్స్‌తో పలు విమర్శలను ఎదుర్కొన్న కేఎల్ రాహుల్. మరోసారి అభిమానుల టార్గెట్‌లో పడ్డాడు. తొలి వన్డేలో రాహుల్ 31 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. కానీ, అతను మ్యాచ్‌ని పూర్తి చేయలేకపోయాడు. అదే సమయంలో, రెండవ వన్డేలో అతని ఖాతా కూడా తెరవలేకపోయాడు. అతను కేవలం 2 బంతుల్లో ఔటయ్యాడు. రాహుల్ ఆత్మవిశ్వాసం తక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో నిర్ణయాత్మక మ్యాచ్‌లో రిషబ్ పంత్‌ను వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా ఆడించే ఆలోచనలో టీమిండియా ఉంది.





























