తొలి మహిళా ఎస్పీజీ కమాండో అదాసో కపేసా జీతం ఎంతో తెలుసా?
దేశ భద్రతా వ్యవస్థలో కొత్త చరిత్ర సృష్టించిన మహిళ ఇన్‌స్పెక్టర్ అదాసో కపేసా అందరి దృష్టిని ఆకర్షించింది. మణిపూర్ నివాసి అయిన అదాసో ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి ఉన్న ఫోటో వైరల్ అవుతుంది. ప్రధానమంత్రి భద్రతలో చేరిన మొదటి మహిళా SPG కమాండో చరిత్ర సృష్టించింది. మరి ఈమెకు ఎంత వస్తుందో అని చాలామంది అరా తీస్తున్నారు. దీని గురించి ఈరోజు తెలుసుకుంది.
Updated on: Aug 08, 2025 | 9:44 PM

దేశ భద్రతా వ్యవస్థలో కొత్త చరిత్ర సృష్టించిన మహిళ ఇన్‌స్పెక్టర్ అదాసో కపేసా అందరి దృష్టిని ఆకర్షించింది. మణిపూర్ నివాసి అయిన అదాసో ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి ఉన్న ఫోటో వైరల్ అవుతుంది.

దేశంలోని అత్యంత ప్రత్యేక భద్రతా విభాగం స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG)లో మహిళా కమాండోగా విధులు నిర్వహిస్తున్న అదాసో. ప్రధానమంత్రి భద్రతలో చేరిన మొదటి మహిళా SPG కమాండో అదాసో కపేసా. అంతేకాదు దేశ మహిళలకు, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల బిడ్డలకు గర్వకారణం, ప్రేరణ కలిగించే క్షణం.

స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అనేది భారత ప్రధానమంత్రి, అతని కుటుంబ సభ్యుల భద్రత కోసం ఏర్పడిన ప్రత్యేక భద్రతా విభాగం. SPG యూనిట్ కేంద్ర ప్రభుత్వం కింద పనిచేస్తుంది. దాని కమాండోలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. SPG యూనిట్‌లో చేరడం చాలా కష్టం, ఎందుకంటే దీనికి మానసిక, శారీరక స్థాయిలో పరీక్షలు ఉంటాయి.

Adaso Kapesa Family

అదాసో కపేసా ధైర్యంతోనే కాకుండా క్రమశిక్షణ, కృషితో తనను తాను నిరూపించుకుంది. SPG కమాండోల నెలవారీ జీతం రూ. 84,000 నుండి రూ. 2.4 లక్షల వరకు ఉంటుంది. వారికి ప్రత్యేక రిస్క్ అలవెన్స్, దుస్తుల భత్యం, ప్రయాణ భత్యం, ఆరోగ్య సౌకర్యాలు అదనం




