- Telugu News Photo Gallery Did you know that your personality can also be determined by the month you were born?
మీరు పుట్టిన నెలను బట్టి కూడా మీ వ్యక్తిత్వం చెప్పవచ్చని తెలుసా?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి పుట్టిన తేదీ, రాశి, అలాగే సమయం, రోజును బట్టి ఆ వ్యక్తి గుణ గణాలు, అతని భవిష్యత్తు గురించి తెలియజేస్తారు. పండితులు. అయితే ఇవే కాకుండా వ్యక్తి పుట్టిన నెలను బట్టి కూడా వ్యక్తి క్యారెక్టర్ చెప్పవచ్చు అంటున్నారు నిపుణులు. కాగా, ఇప్పుడు మనం వ్యక్తిత్వ పరీక్షలో భాగంగా ఏ జనవరి, నుంచి మే నెలలో పుట్టిన వారి స్వభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం
Updated on: Jun 08, 2025 | 5:54 PM

జనవరి : ఈ నెలలో జన్మించిన వారు మంచి ఆశయాలను కలిగి ఉంటారంట. అంతే కాకుండా వీరు కెరీర్ పరంగా కూడా మంచి ఆలోచనతో ఉంటారు. అదే విధంగా మంచి క్షమశిక్షణతో మెదులుతారు. వీరి చాలా వరకు ప్రేమ విషయంలో ఆచీ తూచీ అడుగు వేస్తారు. కుటుంబ సభ్యులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. నిర్ణయం తీసుకునే సమయంలో కూడా చాలా వరకు ఆచీ తూచీ నిర్ణయాలు తీసుకుంటారంట. చాలా నమ్మదగిన వ్యక్తులు జనవరిలో జన్మించిన వారు.

ఫిబ్రవరి : ఈనెలలో జన్మించిన వారు చాలా చలాకీగా ఉంటారంట. అంతే కాకుండా ఈ నెలలో జన్మించిన వారికి దైవ భక్తి చాలా ఎక్కువ. స్నేహితులంటే ప్రాణం ఇస్తారు. అంతే కాకుండా వీరు వీరి భాగస్వామికి మంచి ప్రియారిటీ ఇస్తారు. కెరీర్ పరంగ కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటూ.. గొప్పస్థాయిలో ఉంటారంట. ఎక్కువగా ఈ నెలలో పుట్టిన వారు రాజకీయంగా చాలా గొప్పగా ఎదుగుతారంట.

మార్చి : మార్చి నెలలో జన్మించిన వ్యక్తులు కళారంగంలో మంచి స్థాయిలో ఉంటారు. వీరు చాలా మొండిగా వ్యవహరిస్తారు. కొన్ని సార్లు వీరు తీసుకునే అనాలోచిత నిర్ణయాలు వీరి జీవితంలో పెను ప్రమాదాలకు కారణం అవుతుంది. కానీ వీరికి దయ, ప్రేమ అనేవి ఎక్కువగా ఉంటాయి. అంతే కాకుండా భావోద్వేగ పరంగా కూడా వీరు చాలా అవగాహన కలిగి ఉంటారు. కాస్త సున్నితమైన వ్యక్తులు.

ఏప్రిల్ : ఏప్రిల్ నెలలో జన్మించిన వారు చాలా ధైర్యవంతులు. దేనికి ఈ నెలలో పుట్టిన వారు అస్సలే భయపడరు. అంతే కాకుండా వీరిలో నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. చాలా ఉత్సాహంగా ఉంటారు. అందరి దృష్టిని వీరు చాలా సులభంగా ఆకర్షిస్తారు. కానీ ఈనెలలో పుట్టిన వారు ప్రేమ విషయంలో మోసపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కానీ వీరు మాత్రం నిజాయితీగా వ్యవహరిస్తారు.

మే : మే నెలలో జన్మించిన వారు చాలా అదంగా, ఆకర్షణీయంగా ఉంటారు. అంతే కాకుండా వీరు చాలా సున్నితమైన వ్యక్తులు. ఈ నెలలో పుట్టిన వారు తమ జీవితాన్ని, విలాసవంతంగా గడపడానికి ఇష్టపడతారు. ప్రేమలో చాలా నియజాయితీగా ఉంటారు కానీ కొన్నిసార్లు వారి మొండితనం ప్రేమలో ఉద్రిక్తతకు కారణమవుతుంది. వారు ప్రేమలో పడిన తర్వాత, వారు తమను తాము పూర్తిగా అంకితం చేసుకుంటారు.



















