ఫోన్ ఎక్కువగా చూడటం వలన బ్రెయిన్ ట్యూమర్ వస్తుందా?
ప్రస్తుతం బ్రెయిన్ ట్యూమర్ కేసులనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. తీసుకుంటున్న ఆహారం, జీవన శైలి, వర్క్ ప్రెషర్ ఇలా చాలా కారణాల వలన అనేక మంది బ్రెయిన్ ట్యూమర్ బారిన పడుతున్నారు. మెదడులో కణితి కనిపించడాన్ని బ్రెయిన్ ట్యూమర్ అంటారు. కాగా, నేడు ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవం. కాబట్టి అసలు బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏంటి? ఎక్కువగా ఫోన్ వాడితే బ్రెయిన్ ట్యూమర్ వస్తుందా అనే విషయాల గురించి తెలుసుకుందాం.
Updated on: Jun 08, 2025 | 5:55 PM

బ్రెయిన్ ట్యూమర్ అనేది తీవ్రమైన వ్యాధి. మెదడులో కణితి కనిపిస్తే దాన్ని బ్రెయిన్ ట్యూమర్ అంటారు. కొంత మంది ఆరోగ్యంగా ఉన్నప్పటికీ ఒక్కసారిగా దీని లక్షణాలు బయటపడుతుంటాయి. కాగా, దాని గురించే ఇప్పుడు మనం తెలుసుకుందాం.

బ్రెయిన్ ట్యూమర్ ఉన్న వ్యక్తికి తల నొప్పి అనేది వస్తూ పోతూ ఉంటుంది. అంతే కాకుండా కొన్ని సార్లు విపరీతంగా తలనొప్పి వస్తుంటుంది. అలాగే ఇంకొన్ని సార్లు తలనొప్పితో పాటు వికారం, వాంతులు కూడా రావచ్చు. అలాగే దృష్టి, మాట,వినికిడి మారే ఛాన్స్ ఉంటుందంటున్నారు నిపుణులు.

అంతే కాకుండా బ్రెయిన్ ట్యూమర్ ఉన్న వ్యక్తి రోజులు గడిచే కొద్దీ,మానసిక స్థిరత్వాన్ని కోల్పోతారంట, జ్ఞాపకశక్తి తగ్గతుండటంతో గందరగోళానికి గురి అవుతారంట. తీవ్రమైన అలసట, వినికిడి లోపానికి గురికావడం జరుగుతుందంట. అంతే కాకుండా తల తిరగడం, కాళ్లు కదపలేకపోవడం వంటి సమస్యలు కూడా తలెత్తుతాయని చెబుతున్నారు వైద్యులు.

బ్రెయిన్ ట్యూమర్ అనేది ఎక్కువగా వంశపారం పర్యంగా వస్తుందంట. కొన్ని సార్లు వయసుతో సంబంధం లేకుండా ఎవరికైనా వచ్చే ప్రమాదం లేకపోలేదని చెబుతున్నారు నిపుణులు. అంతే కాకుండా ఎక్కువ సేపు రేడియేషన్ కు గురైన వ్యక్తులకు కూడా బ్రెయిన్ ట్యూమర్ వచ్చే ఛాన్స్ ఉంటుందంట.

అయితే కొంత మందికి ఒక డౌట్ ఉంటుంది. అతిగా సెల్ ఫోన్ వాడితే బ్రెయిన్ ట్యూమర్ వస్తుందా అని. కాగా, దాని గురించి నిపుణులు ఏమంటున్నారంటే? ఎక్కువ సేపు సెల్ ఫోన్ వాడుతున్నా బ్రెయిన్ ట్యూమర్ వచ్చే ఛాన్స్ 60 శాతం ఉంది అని చెప్తున్నారు. అందువలన చాలా వరకు సెల్ ఫోన్‌కు దూరంగా ఉండటం చాలా మంచిదంట.



