- Telugu News Photo Gallery Diabetic patients should take these precautions in winter, Check Here is Details
Diabetic Patients: శీతాకాలంలో డయాబెటీస్ రోగులు ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!
డయాబెటీస్ రోగులు వింటర్ సీజన్‌లో మరింత జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. ఈ కాలంలో ఎక్కువగా చాలా మంది జంక్ ఫుడ్ తింటూ ఉంటారు. ఈ ఆహారానికి చాలా దూరంగా ఉండాలి..
Updated on: Dec 10, 2024 | 5:21 PM

రోజురోజుకూ డయాబెటీస్ రోగుల సంఖ్య పెరుగుతూనే ఉంది. డయాబెటీస్ రోగులు.. ఆహార విషయంలో జాగ్రత్తలు పాటిస్తేనే కంట్రోల్ అవుతుంది. లేదంటే షుగర్ లెవల్స్ పెరిగిపోతాయి. చక్కెర లెవల్స్ పెరిగితే.. ప్రాణానికే ప్రమాదం. అందులోనూ చలి కాలంలో మరింత జాగ్రత్త అవసరం.

వింటర్ సీజన్‌లో కూడా ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించడం ముఖ్యం. కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటేనే మంచిది. కేవలం ఆహారపు అలవాట్ల కారణంగానే డయాబెటీస్ వ్యాధి అనేది పెరిగిపోతుంది. డయాబెటీస్‌కి ఇప్పటికీ పూర్తి చికిత్స అనేది రాలేదు.

శీతా కాలంలో ఫాస్ట్ ఫుడ్స్, బిర్యానీలు, ఇతర వేడి వేడి ఆహారాలు తీసుకోవాలని అనిపిస్తుంది. వీటి జోలికి అస్సలు పోకండి. ఆకు కూరలు, పండ్లనే ఎక్కువగా తీసకోండి. చలికాలంలో చాలా తేలికమైన ఆహారం తీసుకోవడమే మేలు.

శీతా కాలంలో చాలా మంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఏవి పడితే అవి తింటూ ఉంటారు. బయట ఆహారం తీసుకునే విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఇన్ఫెక్షన్లు, వైరస్‌లు త్వరగా ఎటాక్ చేస్తాయి. డయాబెటీస్ రోగులకు ఏది వచ్చినా అంత త్వరగా తగ్గవు.

అదే విధంగా వ్యాయామం కూడా ఖచ్చితంగా చేయాలి. ఏదో ఒక పూట వాకింగ్ అయినా ఉండేలా చూసుకోవాలి. శారీరక శ్రమ ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి. శారీరక శ్రమతోనే చక్కెర లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)





























