- Telugu News Photo Gallery Diabetes can be controlled by eating raw mangoes here is details in telugu
Raw Mango: పచ్చి మామిడి తింటే ఎన్ని లాభాలో.. డయాబెటిస్ ఉంటే పక్కా తినాల్సిందే…
సమ్మర్ వచ్చిందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో మామిడి పండ్లు విరివిగా దొరుకుతాయి. ఎంతో స్వీట్‌గా ఉండే మామిడిని పిల్లలు నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడారు. అంతేకాదు ఇందులో మినరల్స్ డైటరీ ఫైబర్, ఇతర వినిమిన్లు మెండుగా ఉంటాయి. కొంత మంది పచ్చి మామిడిని ముక్కలుగా కోసుకోని.. లైట్‌గా ఉప్పు, కారం వేసుకుని తింటారు.
Updated on: Apr 27, 2023 | 4:28 PM

పచ్చిమామిడిని తినడం చాలా మంచిదట. అయితే అందులో వేసే ఉప్పు, కారం పరిమితంగా ఉండాలి. అస్సలు వేసుకోకపోతే ఇంకా మంచింది. ఇది బాడీకి హీట్ నుంచి తట్టుకునే ఎనర్జీ ఇస్తుంది. ఇక సీ విటమిన్ కావాల్సినంత ఉంటుంది. సమ్మర్‌లో వచ్చే చాలా వ్యాధులను ఎదుర్కొనే శక్తి పచ్చి మామాడి ఇస్తుందట.

పచ్చి మామిడిలో ఉండే క్యాలరీలు కూడా చాలా తక్కువ. సో.. బరువు పెరిగే అవకాశం కూడా ఉండదు. మధుమేహంతో బాధపడే వారు పచ్చి మామిడి తినడం ఎంతో అవసరం.

పచ్చి మామిడి తినడం వల్ల వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్‌లో ఉంటాయి. దీంతో షుగర్ కూడా అదుపులో ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలోనూ పచ్చి మామిడికాయ కీ రోల్ పోషిస్తుంది.

పచ్చిమామిడి తినడం వల్ల మన బాడీకి కావాల్సిన విటమిన్ ఏ 10 శాతం వరకు అందుతుంది. రోగనిరోధక వ్యవస్థ స్ట్రాంగ్‌గా పని చెయ్యాలంటే ఇది చాలా అవసరం. ఇక మెగ్నీషియం, పొటాషియం ఉన్న సరిపడినంత అందుతాయి.

పచ్చి మామిడికాయలో ఉండే మాంగిఫెరిన్ యాక్సిడెంట్ గుండెకు ఎంతో మంచి చేస్తుంది. ఒత్తిడిని తగ్గించే పాలీఫెనాల్స్ కూడా పచ్చి మామిడి నుంచి లభిస్తాయి. ఇవి క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. పచ్చి మామిడికాయ తినడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు. ఈ సమాచారం కేవలం నిపుణుల నుంచి సేకరించబడింది. మీకు ఎటువంటి సందేహాలున్నా డైటీషియన్లు, డాక్టర్లను సంప్రదించండి.




