- Telugu News Photo Gallery Detox drink: Importance Of Detoxification And How To Make Detox Drink At Home
Detox Drink: ఈ పానియాలు ఉదయం పూట తాగారంటే శరీరంలోని మలినాలు బయటికి..
అతిగా తినడం, త్రాగడం వలన జీర్ణ వ్యవస్థ దెబ్బ తింటుంది. ఫలితంగా కడుపులో వ్యర్ధాలు పేరుకుపోతాయి. శరీరం నుంచి వ్యర్ధాలను ఎప్పటి కప్పుడు బయటికి పంపించకుంటే జీవక్రియ క్షీణించడం ప్రారంభిస్తుంది. ఎప్పటికప్పుడు నిర్విషీకరణ సరిగ్గా జరగకపోతే శరీరం కూడా ఆరోగ్యంగా ఉండదు. దీని ప్రభావం మన చర్మంపై కూడా ప్రభావం చూపుతుంది. శరీరంలోని విషపదార్ధాలను వదిలించుకోవడానికి కొన్ని ఆయుర్వేద పద్ధతులను
Updated on: Dec 08, 2023 | 7:04 PM

అతిగా తినడం, త్రాగడం వలన జీర్ణ వ్యవస్థ దెబ్బ తింటుంది. ఫలితంగా కడుపులో వ్యర్ధాలు పేరుకుపోతాయి. శరీరం నుంచి వ్యర్ధాలను ఎప్పటి కప్పుడు బయటికి పంపించకుంటే జీవక్రియ క్షీణించడం ప్రారంభిస్తుంది. ఎప్పటికప్పుడు నిర్విషీకరణ సరిగ్గా జరగకపోతే శరీరం కూడా ఆరోగ్యంగా ఉండదు. దీని ప్రభావం మన చర్మంపై కూడా ప్రభావం చూపుతుంది.

శరీరంలోని విషపదార్ధాలను వదిలించుకోవడానికి కొన్ని ఆయుర్వేద పద్ధతులను పాటించాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొన్ని పానీయాలు తాగడం వల్ల శరీరంలోని అన్ని టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి. ఫలితంగా శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అవి ఏమిటో పరిశీలించండి...

నిమ్మరసం నీరు నిర్విషీకరణకు ఉత్తమమైనది. మిరియాలు జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. జీవక్రియ రేటును పెంచుతుంది. అధ్యయనాల ప్రకారం, ఈ పానీయంలో విటమిన్ సి ఉంటుంది. ఇది విషాన్ని సులభంగా తొలగిస్తుంది. నిమ్మరసంలో మిరియాల పొడి కలుపుకుని తాగితే శరీరానికి మేలు కలుగుతుంది.

కాలేయం, జుట్టు, చర్మం, కంటి సమస్యలను తొలగించడంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ డయాబెటిక్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు దోహదపడతాయి. దోసకాయ, పాలకూర, క్యారెట్, అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది మీ కడుపు, ప్రేగులను లోపలి నుంచి శుభ్రం చేయడానికి సహాయపడుతుంది.

ప్రతిరోజూ ఉదయం ఒక గ్లాసు కలబంద రసం తాగడం వల్ల టాక్సిన్స్ సులభంగా తొలగిపోతాయి. ఈ పానీయం ప్రమాదకరమైన ఫ్రీ రాడికల్స్, ఆక్సీకరణ ఒత్తిడిని సులభంగా నాశనం చేస్తుంది. అలాగే రోజంతా తరచుగా నీళ్లు తాగుతుండాలి. అలాగే ప్రతిరోజూ ఉదయం జీలకర్ర వేసి మరిగించిన నీటిని తాగడం వల్ల ఎలాంటి జీర్ణ సమస్యలు రావు. జీలకర్రకు బదులుగా చియా గింజలు, తులసి గింజలు కూడా వినియోగించవచ్చు.





























