- Telugu News Photo Gallery Cricket photos Yashasvi Jaiswal and his father doesn't sell panipuris says Coach Jwala Singh
Yashasvi Jaiswal: ఈ ఫొటోలో ఉన్నది యశస్వి తండ్రి కాదు.. అసలు వాళ్లు పానీపూరీ అమ్మలేదు: కోచ్ షాకింగ్ కామెంట్స్
Yashasvi Jaiswal Coach Jwala Singh: ప్రస్తుతం భారత క్రికెట్ ప్రపంచంలో ట్రెండింగ్‌లో ఉన్న పేరు యశస్వి జైస్వాల్‌ది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఐపీఎల్ , ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అద్భుత ప్రదర్శన కనబరిచి జాతీయ జట్టుకు ఎంపికైన జైస్వాల్ అరంగేట్రం మ్యాచ్ లోనే రెచ్చిపోయాడు.
Updated on: Jul 18, 2023 | 11:47 AM

Yashasvi Jaiswal Coach Jwala Singh: ప్రస్తుతం భారత క్రికెట్ ప్రపంచంలో ట్రెండింగ్‌లో ఉన్న పేరు యశస్వి జైస్వాల్‌ది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఐపీఎల్ , ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అద్భుత ప్రదర్శన కనబరిచి జాతీయ జట్టుకు ఎంపికైన జైస్వాల్ అరంగేట్రం మ్యాచ్ లోనే రెచ్చిపోయాడు.

వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ అరంగేట్రం చేసి, తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించాడు. దీంతో భారత జట్టులో తన స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు.

జైస్వాల్ నడిచిన విజయవంతమైన బాట చాలా మందికి తెలుసిందే. అయితే, ప్రస్తుతం తన చిన్ననాటి కోచ్ ఇచ్చిన స్టేట్ మెంట్స్ చూస్తే మాత్రం.. యశస్వి అబద్దాలు చెప్పాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. యశస్వి ఇంటర్వ్యూల్లో మాట్లాడిన సందర్భాల్లో చిన్నతనంలో పానీపూరీ అమ్మినట్లు చెప్పడంట.

ఈ క్రమంలో జైస్వాల్ చిన్ననాటి కోచ్ జ్వాలా సింగ్ మాట్లాడుతూ.. పానీపూరి విషయం తన జీవితంలో లేదని, రిపబ్లిక్ వరల్డ్ నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలోయశస్వి మాట్లాడుతూ.. ఇది విషయం చెప్పడంట. అప్పటి నుంచి మీ డియా ఈ విషయన్నా హెడ్డింగ్‌ల కోసం వాడుతున్నట్లు ఆయన కోచ్ వెల్లడించారు.

ఓ ఇంటర్వ్యూలో జైశ్వాల్‌ను వ్యక్తిగత ప్రశ్నలు అడిగారు. యశస్వి తన అమాయకత్వంతో పానీపూరీ సంఘటనను ప్రస్తావించాడు. ఇంటర్వ్యూలో పాల్గొన్నవారు తమ కథనాలకు ప్రాధాన్యత ఇచ్చేందుకు పానీపూరీ థీమ్‌ను హెడ్‌లైన్స్‌గా చేసుకుని పెద్ద వార్తలు రాశరని జ్వాలా సింగ్ అన్నారు.

జైస్వాల్ ప్రదర్శన ఇచ్చిన ప్రతిసారీ, పానీపూరీ స్టాల్ వద్ద ఒక వ్యక్తితో నిలబడి ఉన్న ఫొటో కనిపిస్తుంది. అయితే ఆ ఫోటోలో ఉన్నది తన తండ్రి కాదని, ఇది కేవలం సాధారణ ఫొటో అని ఆయన అన్నాడు. తాము జీవనోపాధి కోసం పానీపూరీ అమ్మడం లేదని జైస్వాల్, అతని తండ్రి స్పష్టం చేశారు. 2013లో క్రికెట్ కోచింగ్ ప్రారంభించినప్పుడు పానీపూరీలు అమ్మలేదు. అతను మొదట ముంబైకి వచ్చి ఒక డేరాలో నివసించేవాడు. అక్కడ కొద్ది రోజులు పానీపూరీలు విక్రయించి ఉండవచ్చు. వారికి కనీస సౌకర్యాలు లేవు, కరెంటు లేదు, సరైన ఆహారం లేదు. వర్షాకాలంలో వారి గుడారం నీటితో నిండిపోయేదని జ్వాలా సింగ్ అన్నారు.

గత 10 సంవత్సరాలుగా యశస్వీని చూస్తున్నాను. U-19 ప్రపంచ కప్ 2020కి ముందు పానీపూరీ అమ్మేవాడంటూ కథనాలు వచ్చేవి. ఇలాంటి కథనాలు యశస్వీకి సహాయం చేసిన వ్యక్తుల సహకారాన్ని కించపరుస్తాయని జ్వాలా సింగ్ తెలిపాడు.

జైస్వాల్ మొదట్లో ముంబైకి వచ్చినప్పుడు, అతని తల్లిదండ్రులు ప్రతి నెలా రూ. 1000 చెల్లించేవారు. అతని తండ్రికి పెయింట్ షాప్ ఉంది. సరైన కోచింగ్ వల్లే జైస్వాల్ ఈరోజు క్రికెట్ ఆడుతున్నాడు. వారికి ఆహారం, నివాసం, అన్నీ సమకూర్చి నా చేతనైనంత సాయం చేశాను. నా జీవితంలో 9 విలువైన సంవత్సరాలు జైస్వాల్‌కి ఇచ్చాను అని జ్వాలా సింగ్ ప్రకటించాడు.

ఇప్పుడు ప్రశ్న ఎవరు నిజం చెబుతున్నారు? ఎవరు అబద్ధం? చెబుతున్నారనేది తెలియాల్సి ఉంది. యశస్వి నిజం చెబితే, అతని కోచ్ జ్వాలా సింగ్ అబద్ధం చెప్పటినట్లేనని తెలిస్తుంది. దీంతో ప్రస్తుతం నెటిజన్లు యశస్వి, ఆయన చిన్ననాటి కోచ్ జ్వాలాసింగ్‌లో ఎవరు నిజం చెబుతున్నారో తెలియక తికమక పెడుతున్నారో తెలియని అయోమయంలో పడ్డారు.




