- Telugu News Photo Gallery Cricket photos Virat Kohli and Rohit Sharma may not be include in the T20I squad for the Ireland series
Team India: టీమిండియా ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. ఇకపై ఆ ఇద్దరు టీ20లు ఆడరు? షాకివ్వనున్న సెలెక్టర్లు
Rohit Sharma - Virat Kohli: ఐర్లాండ్‌తో జరిగే సిరీస్‌కు హార్దిక్ పాండ్యా భారత జట్టుకు నాయకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ రోహిత్, కోహ్లిలను వన్డేలు, టెస్టు మ్యాచ్‌లకు మాత్రమే పరిగణనలోకి తీసుకుని టీ20 నుంచి పూర్తిగా తప్పించే అవకాశం ఉంది.
Updated on: Jul 18, 2023 | 11:21 AM

Rohit Sharma - Virat Kohli: 2024లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని టీ20 సిరీస్‌కు యువ ఆటగాళ్లను మాత్రమే భారత సెలక్షన్ కమిటీ ఎంపిక చేస్తోంది. సీనియర్ ఆటగాళ్లను మాత్రం పక్కన పెట్టేశారు.

ఇప్పుడు అదే బాటను కొనసాగిస్తూ ఐర్లాండ్‌తో జరిగే సిరీస్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి ఆటగాళ్లను తప్పించాలని సెలక్షన్ కమిటీ నిర్ణయించినట్లు సమాచారం.

వెస్టిండీస్ పర్యటన తర్వాత, భారత్ ఐర్లాండ్‌కు వెళ్లనున్న సంగతి తెలిసిందే. అక్కడ భారత జట్టు మూడు మ్యాచ్‌ల T20 సిరీస్ ఆడనున్నారు. ఈ మేరకు మరికొద్ది రోజుల్లో టీమిండియాను ప్రకటించనున్నారు.

ఐర్లాండ్‌తో జరిగే సిరీస్‌కు హార్దిక్ పాండ్యా భారత జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ రోహిత్, కోహ్లిలను వన్డేలు, టెస్టు మ్యాచ్‌లకు మాత్రమే పరిగణనలోకి తీసుకుని టీ20 నుంచి పూర్తిగా తప్పించే అవకాశం ఉందని తెలుస్తోంది.

టీ20 ప్రపంచకప్ 2022లో భారత్ ఓడిపోయినప్పటి నుంచి విరాట్, రోహిత్ ఒక్క అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కూడా ఆడకపోవడం గమనార్హం. టీ20 ప్రపంచకప్‌లో భారత్ ఓటమి తర్వాత హార్దిక్ పాండ్యా జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. అయితే అధికారికంగా ఆయనకు ఇంకా నాయకత్వం ఇవ్వలేదు. వన్డే ప్రపంచకప్ తర్వాత టీ20 కెప్టెన్సీపై సెలక్టర్లు తుది నిర్ణయం తీసుకోవచ్చు.

మూడు టీ20ల కోసం టీమిండియా ఐర్లాండ్‌లో పర్యటించనుంది. ఇది ఆగస్టు 18, 20, 23 తేదీల్లో ఆడనుంది. క్రిక్‌బజ్‌లోని ఒక నివేదిక ప్రకారం రాహుల్ ద్రవిడ్, అతని కోచింగ్ సిబ్బందికి ఐర్లాండ్ సిరీస్‌లో విశ్రాంతి ఇవ్వనున్నారు. జాతీయ క్రికెట్ అకాడమీ అధినేత వీవీఎస్ లక్ష్మణ్ ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నాడు.




