- Telugu News Photo Gallery Cricket photos WPL 2024: Royal Challengers Bangalore's Young Bowler Asha Sobhana 1st Indian To Take Fifer
WPL 2024: డబ్ల్యూపీఎల్‌లో కొత్త చరిత్ర లిఖించిన ఆర్సీబీ స్పిన్నర్.. తొలి బౌలర్‌గా భారీ రికార్డ్..
Asha Sobhana: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లోని 2వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) థ్రిల్లింగ్ విజయంతో శుభారంభం చేసింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో యూపీ వారియర్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ జట్టు కేవలం 2 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది. అయితే, ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన ఆశా 22 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టి, ప్రత్యేక జాబితాలో చోటు దక్కించుకుంది.
Updated on: Feb 25, 2024 | 2:47 PM

WPL 2024: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో UP వారియర్స్ (UPW)తో జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంలో RCB స్పిన్నర్ ఆశా శోభన విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన ఆశా 22 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టింది.

ఈ ఐదు వికెట్లతో మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఐదు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా రికార్డు సృష్టించింది. ఈ ఘనత సాధించిన తొలి RCB బౌలర్‌గా కూడా నిలిచింది. అంతేకాకుండా, RCB ఫ్రాంచైజీకి ఈ ఘనత సాధించిన 5వ బౌలర్‌గా నిలిచింది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ తరపున 5 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా అనిల్ కుంబ్లే రికార్డు సృష్టించాడు. 2009లో రాజస్థాన్ రాయల్స్‌పై కుంబ్లే కేవలం 5 పరుగులకే 5 వికెట్లు పడగొట్టాడు.

ఆ తర్వాత 2013లో జయదేవ్ ఉనద్కత్, 2021లో హర్షల్ పటేల్, 2022లో వనిందు హసరంగా ఆర్సీబీ తరపున 5 వికెట్లు తీసి మెరిశారు. ఈ నలుగురు మినహా ఆర్‌సీబీ పురుషుల జట్టు తరపున ఏ బౌలర్ కూడా 5 వికెట్లు తీయలేదు.

ఇప్పుడు యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన ఆశా శోభన ప్రత్యేక సాధకుల జాబితాలో చేరింది. ఈ ఘనత సాధించిన తొలి RCB మహిళా క్రీడాకారిణిగా కూడా నిలిచింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టు 6 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించిన యూపీ వారియర్స్‌కు చివరి ఓవర్‌లో 11 పరుగులు కావాల్సి ఉంది. అయితే, ఆఖరి ఓవర్‌లో 8 పరుగులు మాత్రమే ఇవ్వడంతో RCB జట్టు 2 పరుగుల తేడాతో విజయం సాధించింది.




