- Telugu News Photo Gallery Cricket photos These 4 Teams Will Reach To T20 World Cup 2024 Semifinals, Says New Zealand Player
షాకింగ్ ప్రిడిక్షన్.! టీ20 ప్రపంచకప్ సెమీస్ నుంచి టీమిండియా ఔట్.? ఎవరిచ్చారో తెలుసా.?
ఇదేం ప్రిడిక్షన్ సామీ.. టీమిండియా లేకుండానే టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ జరుగుతుందా.? ప్రస్తుతం సోషల్ మీడియాలో న్యూజిలాండ్ ఆటగాడు ఈ మెగా టోర్నమెంట్ సెమీస్‌కు చేరే జట్లపై ఇచ్చిన అంచనా వైరల్‌గా మారింది. మరి అది ఎవరిచ్చారో తెలుసుకుందామా..
Updated on: Mar 13, 2024 | 4:06 PM

పొట్టి క్రికెట్ ఫీవర్ ఊపందుకుంది. మార్చి ఎండింగ్‌లో ఐపీఎల్ మొదలు కాబోతుంటే.. ఈ రిచ్చెస్ట్ లీగ్ పూర్తి కాగానే.. టీ20 ప్రపంచకప్ మొదలవుతుంది. జూన్ నెలలో అమెరికా, వెస్టిండీస్ వేదికలుగా ఈ మెగా టోర్నమెంట్ స్టార్ట్ కాబోతోంది.

జూన్ 1 నుంచి మొదలయ్యే ఈ టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీ.. జూన్ 29న జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ముగుస్తుంది. మొత్తం 20 జట్లు నాలుగు గ్రూప్‌లుగా తాడోపేడో తేల్చుకోనున్నాయి.

ఈ టోర్నీలో గ్రూప్-ఏ నుంచి భారత్, పాకిస్తాన్‌లు తలబడనున్న సంగతి తెలిసిందే. టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా తన తొలి మ్యాచ్ జూన్ 5న ఐర్లాండ్‌తో ఆడుతుంది. ఆ తర్వాత జూన్ 9న చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.

ఈ క్రమంలోనే న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గప్తిల్ టీ20 ప్రపంచకప్ సెమీస్‌కు చేరే జట్లపై ఓ ప్రిడిక్షన్ ఇచ్చాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు కచ్చితంగా ప్రపంచకప్ సెమీఫైనల్‌కు చేరుతాయని..

నాలుగో జట్టుగా ఇంగ్లాండ్ లేదా పాకిస్తాన్ జట్లలో ఒకటి చేరే అవకాశముందని గప్తిల్ తెలిపాడు. మరి మూడో జట్టు ఏంటన్నది క్లారిటీ ఇవ్వలేదు గప్తిల్.. టీమిండియా గురించి మాత్రం ప్రిడిక్షన్ ఇవ్వలేదు.




