- Telugu News Photo Gallery Cricket photos Rohit Sharma and Jay Shah Visit to Mumbai Siddhivinayak Temple With T20 World Cup Trophy
Rohit Sharma: టీ20 ప్రపంచకప్ ట్రోఫీతో రోహిత్ శర్మ ప్రత్యేక పూజలు.. ఎక్కడికి వెళ్లాడో తెలుసా?
T20 World Cup 2024 Final: బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 176 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించలేక పోయిన దక్షిణాఫ్రికా జట్టు 20 ఓవర్లలో 169 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో రెండోసారి పొట్టి ట్రోఫీ భారత్ ఖాతాలో చేరింది.
Updated on: Aug 22, 2024 | 10:14 AM

టీ20 ప్రపంచకప్‌తో ముంబైలోని సిద్ధివినాయక ఆలయాన్ని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, బీసీసీఐ సెక్రటరీ జై షా సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే, టీ20 ప్రపంచకప్ కోసం ప్రత్యేక హారతి వెలిగించారు.

17 ఏళ్ల తర్వాత భారత్‌కు దక్కిన టీ20 వరల్డ్‌కప్‌నకు సంబంధించిన ప్రత్యేక పూజల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ పూజల తర్వాత, CEAT అవార్డుల కార్యక్రమంలో టీమ్ ఇండియా కెప్టెన్, BCCI సెక్రటరీ కలిసి కనిపించారు.

బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టును ఓడించి టీమిండియా ప్రపంచకప్‌ను ఎగరేసుకుపోయింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా హీరోలుగా నిలిచారు. కింగ్ కోహ్లి 76 పరుగులు చేసి టీమ్ ఇండియా 176 పరుగులు చేయడంలో సహకరించాడు.

177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు ఒక దశలో విజయాన్ని ఖాయం చేసుకుంది. ఎందుకంటే చివరి 30 బంతుల్లో దక్షిణాఫ్రికా జట్టుకు కేవలం 30 పరుగులు మాత్రమే కావాలి. ఈ సమయంలో దాడికి దిగిన జస్ప్రీత్ బుమ్రా మ్యాచ్ మొత్తం మార్చేశాడు.

చివరి 5 ఓవర్లలో బుమ్రా వేసిన 2 ఓవర్లు భారత్ విజయంలో నిర్ణయాత్మక పాత్ర పోషించాయి. జస్‌ప్రీత్ బుమ్రా 16వ ఓవర్‌లో 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో ఒత్తిడికి లోనైన హెన్రిక్ క్లాసెన్ 17వ ఓవర్ తొలి బంతికి హార్దిక్ పాండ్యాకు వికెట్ లొంగిపోయాడు. అలాగే ఈ ఓవర్‌లో పాండ్యా కేవలం 4 పరుగులే ఇచ్చాడు.

ఆ తర్వాత 18వ ఓవర్‌లో జస్‌ప్రీత్ బుమ్రా మరోసారి రంగంలోకి దిగి మార్కో జాన్‌సెన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ ఓవర్‌లో బుమ్రా కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు. చివరకు 20 ఓవర్లలో 169 పరుగులకే ఆలౌటైన సౌతాఫ్రికా జట్టు 7 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో టీ20 ప్రపంచకప్‌ను టీమ్‌ఇండియా రెండోసారి కైవసం చేసుకుంది.




