- Telugu News Photo Gallery Cricket photos Pakistan Player Saud Shakeel Equals 65 Year Old Test Record
Test Record: 65 ఏళ్ల రికార్డ్‌ను బ్రేక్ చేసిన 28 ఏళ్ల ప్లేయర్.. 11వ టెస్ట్‌లోనే బీభత్సం..
Pakistan vs Bangladesh, 1st Test: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచింది. వర్షం ప్రభావంతో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి రోజు 41 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఈ విధంగా తొలిరోజు ఆటలో పాక్ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది.
Updated on: Aug 22, 2024 | 12:43 PM

Pakistan vs Bangladesh, 1st Test: రావల్పిండి వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ సౌద్ షకీల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అలాగే 65 ఏళ్ల రికార్డును సమం చేయడం విశేషం.

బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అలా ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్ కేవలం 16 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో కలిసి వచ్చిన సయీమ్ అయ్యూబ్ (56), సౌద్ షకీల్ మంచి బ్యాటింగ్ ప్రదర్శించారు.

ముఖ్యంగా 92 బంతులు ఎదుర్కొన్న సౌద్ షకీల్ 5 ఫోర్లతో అజేయంగా 57 పరుగులు చేసి జట్టుకు అండగా నిలిచాడు. ఈ హాఫ్ సెంచరీతో సౌద్ టెస్టు క్రికెట్‌లో 1000 పరుగులు పూర్తి చేశాడు. అది కూడా 11 మ్యాచ్‌ల ద్వారానే కావడం విశేషం.

దీంతో పాటు పాకిస్థాన్ తరపున టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్‌మెన్‌గా సౌద్ షకీల్ రికార్డును సమం చేశాడు. ఇంతకు ముందు ఈ రికార్డ్ సయీద్ అహ్మద్ పేరు మీద ఉండేది. ఇప్పుడు సౌద్ 6 దశాబ్దాల నాటి రికార్డును సమం చేయగలిగాడు.

1959లో, సయీద్ అహ్మద్ 20 ఇన్నింగ్స్‌ల్లో 1000 పరుగులు పూర్తి చేసి, పాకిస్థాన్ తరపున టెస్టుల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఆ తర్వాత ఈ రికార్డును ఎవరూ సమం చేయలేకపోయారు.

ఇప్పుడు ఈ ఫీట్‌ను రిపీట్ చేయడంలో లెఫ్టార్మ్ పేసర్ సౌద్ షకీల్ సక్సెస్ అయ్యాడు. 11 టెస్టు మ్యాచ్‌ల్లో 20 ఇన్నింగ్స్‌లు ఆడిన సౌద్ 1024 పరుగులు చేశాడు. దీంతో సౌద్ షకీల్ 65 ఏళ్ల రికార్డును సమం చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు.




