- Telugu News Photo Gallery Cricket photos On this Day: west indies cricketer Dwayne Bravo born on this day Telugu Cricket News
భారత వరుస విజయాలకు బ్రేకులు వేశాడు.. బోర్డు గొడవలతో టీ20 లీగ్‌లలో ఎంట్రీ.. ధోని టీంలో కీలక ఆటగాడిన మారిన ప్లేయర్ ఎవరంటే?
డ్వేన్ బ్రావో 2004 లో తన టెస్ట్ అరంగేట్రం చేశాడు. 2013 వరకు అంటే తొమ్మిదేళ్ల కెరీర్‌లో బ్రావో 40 టెస్టులు మాత్రమే ఆడాడు. అయితే ఈ కాలంలో వెస్టిండీస్ 81 టెస్టులు ఆడింది.
Updated on: Oct 07, 2021 | 7:22 PM

టెస్ట్ కెరీర్‌లో అరంగేట్రం చేసిన తరువాత.. ఆ టీం 23 మ్యాచ్‌లు ఓడిపోయింది. అలా మూడున్నర సంవత్సరాల తరువాత అతని జట్టు టెస్ట్ మ్యాచ్ గెలిచింది. దీంతో ఈ ఆటగాడు కూడా తొలి విజయాన్ని రుచి చూశాడు. ఆ తరువాత ఈ ఆటగాడు టెస్ట్, వన్డే కంటే టీ20 క్రికెట్‌లో అద్భుతమైన ఆటతో ఆకట్టుకుంటున్నాడు. టీ20 లో ఈ ఆటగాడు టాప్ ఆల్ రౌండర్లలో ఒకడు. ఆ క్రికెటర్ మరెవరో కాదు. ఈ రోజు పుట్టినరోజు నిర్వహించుకుంటున్న డ్వేన్ బ్రావోనే. ఆ వెస్టిండీస్ ప్లేయర్ 7 అక్టోబర్ 1983 న ట్రినిడాడ్‌లో జన్మించాడు. 2004 లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఐపీఎల్‌లో ఈ ఆటగాడు మొదట ముంబై ఇండియన్స్‌తో ఆడాడు. తర్వాత చెన్నై సూపర్ కింగ్స్‌లో చేరి కీలక ఆటగాడిగా మారాడు.

డ్వేన్ బ్రావో 2004 లో తన టెస్ట్ అరంగేట్రం చేశాడు. 2013 వరకు అంటే తొమ్మిదేళ్ల కెరీర్‌లో బ్రావో 40 టెస్టులు మాత్రమే ఆడాడు. అయితే ఈ కాలంలో వెస్టిండీస్ 81 టెస్టులు ఆడింది. బ్రావో అంతర్జాతీయ క్రికెట్ కంటే ఐపీఎల్‌కు ప్రాముఖ్యతను ఇచ్చాడు. ఈ ఫార్మాట్‌లో డ్వేన్ బ్రావో 40 మ్యాచ్‌ల్లో 86 వికెట్లు పడగొట్టాడు. అతను ఒక ఇన్నింగ్స్‌లో ఆరుసార్లు నాలుగు వికెట్లు, రెండుసార్లు ఐదు వికెట్లు తీసుకున్నాడు. అలాగే 2200 పరుగులు చేశాడు. అతని పేరుపై మూడు సెంచరీలు, 13 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 2012 లో బోర్డుతో పోరాటం చేశాడు. కాంట్రాక్టులో తక్కువ డబ్బు సంపాదించిన తర్వాత.. వెస్టిండీస్ తరపున ఆడే బదులు ఇంగ్లీష్ జట్టు సోమర్‌సెట్ కోసం ఆడేందుకు సిద్ధమయ్యాడు.

2006 లో రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలో భారత జట్టు వరుసగా 17 వన్డేల్లో విజయం సాధించింది. అలాగే 18 విజయానికి సిద్ధమైంది. కానీ జమైకాలో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండో మ్యాచ్‌లో డ్వేన్ బ్రావో యువరాజ్ సింగ్‌ను స్లో బాల్‌తో బౌల్డ్ చేసి తన జట్టుకు ఒక పరుగు విజయాన్ని అందించాడు. దీంతో భారత వరుస విజయాలకు బ్రేక్ వేశాడు. బ్రావో తన వన్డే కెరీర్‌లో 164 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 2968 పరుగులు చేశాడు. అతని పేరుపై రెండు సెంచరీలు ఉన్నాయి. అలాగే 199 వికెట్లు కూడా పడగొట్టాడు.

డ్వేన్ బ్రావో 2013 లో వెస్టిండీస్ వన్డే కెప్టెన్ అయ్యాడు. కానీ, 2014 లో చెల్లింపుపై తన బోర్డుతో పోరాడాడు. ఈ కారణంగా అతను భారత పర్యటనలో ధర్మశాల వన్డేలో మొత్తం జట్టుతో పాటు టాస్‌కు చేరుకున్నాడు. కానీ, బోర్డుతో చెల్లింపుల సమస్య పరిష్కరించబడనంత వరకు ఎవ్వరం ఆడమంటూ ప్రకటించాడు. దీంతో ఆ తరువాత మ్యాచులకు బోర్డు అతడిని పక్కన పెట్టింది. దాంతో బ్రావో ప్రపంచవ్యాప్తంగా టీ 20 లీగ్‌లలో ఆడటం ప్రారంభించాడు. వాటిలో ఐపీఎల్, బిగ్ బాష్ లీగ్ ప్రధానమైనవి.

డ్వేన్ బ్రావో జనవరి 2015 లో టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. అదే సమయంలో వన్డేల్లో భారత్‌తో జరిగిన 2014 ధర్మశాల వన్డే అతని కెరీర్‌లో చివరి మ్యాచ్. అప్పటి నుంచి అతను తన పూర్తి దృష్టిని టీ 20 క్రికెట్‌పై కేంద్రీకరించడం ప్రారంభించాడు. అతను వెస్టిండీస్ కొరకు 86 టీ 20 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 1229 పరుగులు చేయడంతో పాటు 76 వికెట్లు కూడా తీశాడు. ఇటీవలి కాలంలో బ్రావో మరలా వెస్టిండీస్ టీ 20 జట్టులో భాగమయ్యాడు. ఈ నెలలో జరగనున్న టీ 20 ప్రపంచకప్ కోసం అతను విండీస్ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు.

డ్వేన్ బ్రావో మొదటి నుంచి ఐపీఎల్‌లో పాల్గొన్నాడు. అతను మొదట ముంబై ఇండియన్స్‌లో భాగం అయ్యాడు. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్‌లో కీలక సభ్యుడిగా మారాడు. 2013 లో చెన్నై తరపున ఆడిన బ్రావో 32 వికెట్లు తీసుకున్నాడు. ఇది ఒక సీజన్‌లో అత్యధిక వికెట్లు సాధించిన రికార్డుగా నెలకొంది. పలు టీ20 లీగ్‌లలో ఆడుతున్నప్పుడు 504 మ్యాచ్‌లలో 549 వికెట్లు పడగొట్టాడు. అలాగే 6597 పరుగులు కూడా చేశాడు. టీ 20 ల్లో అత్యధిక వికెట్లు తీసిన వ్యక్తిగా రికార్డుల్లోకి ఎక్కాడు.





























