- Telugu News Photo Gallery Cricket photos Mahendra Singh Dhoni Family Tree Here is the ms dhonis family members list
MS Dhoni: ధోని ఫ్యామిలీలో మొత్తం ఎంతమంది ఉన్నారో తెలుసా? మిస్టర్ కూల్ అన్నయ్య, సోదరి ఏం చేస్తున్నారంటే?
MSD తండ్రి పాన్ సింగ్ ధోని జీవితంలో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించాడు ధోనీ ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో టిక్కెట్ ఎగ్జామినర్‌గా ఉద్యోగం పొందాడు. అక్కడ అతను 2001లో TTE పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. అయితే, ధోనీ క్రికెటర్‌గా మారడానికి తన ఉద్యోగాన్ని విడిచిపెట్టినప్పుడు, తండ్రిగా ధోనికి మద్దతుగా నిలిచాడు. అతని కలను సాకారం చేశాడు
Updated on: Jul 13, 2023 | 10:08 PM

లబ్రిటీల వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని చాలామంది కోరుకుంటారు. ఈక్రమంలో భారత దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని కుటుంబం గురించి తెలుసుకుందాం రండి.

కాగా ధోని ఫ్యామిలీలో అతని భార్య సాక్షి గురించి చాలామందికి తెలుసు. అయితే అతని తల్లిదండ్రులు, తోబుట్టువులు, వారి ఫొటోలు ఎప్పుడు బయటకు రాలేదు.

MSD తండ్రి పాన్ సింగ్ ధోని జీవితంలో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించాడు ధోనీ ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో టిక్కెట్ ఎగ్జామినర్‌గా ఉద్యోగం పొందాడు. అక్కడ అతను 2001లో TTE పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. అయితే, ధోనీ క్రికెటర్‌గా మారడానికి తన ఉద్యోగాన్ని విడిచిపెట్టినప్పుడు, తండ్రిగా ధోనికి మద్దతుగా నిలిచాడు. అతని కలను సాకారం చేశాడు.

ఎంఎస్ ధోనీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూసినా, అతనితల్లి దేవికా దేవి అతనికి అండగా నిలిచింది. చిన్నతనంలో, ధోనీ క్రికెటర్‌గా మారడానికి అతని తల్లి నుండి చాలా మద్దతు లభించింది. 2016లో విశాఖపట్నంలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ తన జెర్సీ వెనుక తన తల్లి పేరును కూడా రాసుకున్నాడు.

ఎంఎస్ ధోనీకి అన్నయ్య ఉన్నాడని చాలా మందికి తెలియదు. ధోని కంటే ఆయన10 ఏళ్లు పెద్ద. అయితే ఎక్కడా నరేంద్ర సింగ్ ఫొటోస్ కానీ సమాచారం కానీ లేదు.

ఎంఎస్ ధోని సోదరి పేరు జయంతి. ధోని విజయవంతమైన క్రికెటర్‌గా నిలవడంలో జయంతి పాత్ర కూడా కీలకం. జయంతి ఒక ఇంగ్లీష్ టీచర్.

ఇక ధోని సాక్షిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. 2008లో కోల్‌కతాలోని తాజ్ బెంగాల్‌లో ఇంటర్న్‌గా పనిచేస్తున్నప్పుడు సాక్షిని కలిశాడు ధోని. ఆ తర్వాత మనసులు కలవడతో 2010లో ధోనీ, సాక్షి పెళ్లిపీటలెక్కారు. వీరికి 2015లో జీవా అనే కూతురు జన్మించింది.




