- Telugu News Photo Gallery Cricket photos Ipl 2023 schedule know the 5 key points of indian premier league 2023 season schedule
IPL 2023: 2 గ్రూపులు.. 12 స్టేడియాలు.. పాత ఫార్మాట్‌లోనే.. IPL 2023 షెడ్యూల్‌లో 5 కీలక విషయాలు ఇవే..
IPL 2023 Schedule: ఇండియన్ ప్రీమియర్ లీగ్ తదుపరి సీజన్ షెడ్యూల్ విడుదలైంది. దీంతో అభిమానుల నిరీక్షణ ముగిసింది.
Updated on: Feb 18, 2023 | 6:30 AM

సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తదుపరి సీజన్ షెడ్యూల్ వచ్చేసింది. ఐపీఎల్-2023 షెడ్యూల్‌ను బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. IPL 2023 మార్చి 31 నుంచి ప్రారంభమవుతుంది. ఫైనల్ మ్యాచ్ మే 28 న జరుగుతుంది. ప్రస్తుత విజేత హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్, నాలుగుసార్లు విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.

కోవిడ్ కారణంగా, యూఏఈలో రెండు సీజన్లు ఆడగా, మునుపటి సీజన్ ముంబై, పూణేలో నిర్వహించారు. అయితే ఈసారి లీగ్ పాత ఫార్మాట్‌లోనే జరగనుంది.

12 స్టేడియాల్లో లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. వీటిలో అహ్మదాబాద్, మొహాలి, లక్నో, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, జైపూర్, ముంబై, గౌహతి, ధర్మశాల ఉన్నాయి.

ఈ సీజన్‌లో లీగ్‌లో మొత్తం 74 మ్యాచ్‌లు జరగనుండగా, వాటిలో 70 మ్యాచ్‌లు గ్రూప్ దశలో ఉంటాయి. ఆ తర్వాత మూడు ప్లేఆఫ్‌లు, ఫైనల్ మ్యాచ్‌లు ఉంటాయి.

గ్రూప్-ఎలో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మరియు లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఉన్నాయి. గ్రూప్-బిలో చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు గుజరాత్ టైటాన్స్ జట్లు ఉన్నాయి.

రెండు గ్రూపులుగా విభజించబడిన జట్లు వేదికపై మొత్తం తలో 14 మ్యాచ్‌లు ఆడతాయి. ఆ తర్వాత మూడు ప్లేఆఫ్, ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి.




