- Telugu News Photo Gallery Cricket photos Indian Cricketer Chetan Sakariya shares his marriage photos with Meghna Jambhucha
Chetan Sakariya: పెళ్లి ఫొటోలు షేర్ చేసిన టీమిండియా యంగ్ క్రికెటర్.. కొత్త జంట ఎంత చూడముచ్చటగా ఉందో!
భారత యువ క్రికెటర్ చేతన్ సకారియా తన జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాడు. మేఘనా జంబుచా తో కలిసి ఇటీవలే మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టాడు. తాజాగా తన పెళ్లి ఫొటోలను షేర్ చేశాడు సకారియా. ప్రస్తుతం ఇవి సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి.
Updated on: Jul 24, 2024 | 8:05 PM

భారత యువ క్రికెటర్ చేతన్ సకారియా తన జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాడు. మేఘనా జంబుచా తో కలిసి ఇటీవలే మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టాడు. తాజాగా తన పెళ్లి ఫొటోలను షేర్ చేశాడు సకారియా. ప్రస్తుతం ఇవి సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి

వివాహ వేడుక సందర్భంగా సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు చేతన్ సకారియా, మేఘన. ఈ ఫొటోలు చూసిన వాళ్లంతా కొత్త జంటకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

పెళ్లి ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన సకారియా.. 'ఈ రోజుతో నేను నీవయ్యాను. నువ్వు నేనయ్యాను’ అంటూ రెండు ముక్కల్లో తమ ప్రేమ బంధం గురించి చెప్పుకొచ్చాడు.

భారత క్రికెటర్లు, ఐపీఎల్ సహచరులు, అభిమానులు, నెటిజన్లు సకారియా దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు

ఐపీఎల్ 17వ సీజన్ మినీ వేలానికి ముందే సకారియా, మేఘనల నిశ్చితార్థం జరిగింది. ఇప్పుడు ఇరు కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఇద్దరూ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.

కాగా టీమిండియా జెర్సీతో ఒకే ఒక వన్డే, రెండు టీ20లు ఆడిన చేతన్ సకారియా ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.




