- Telugu News Photo Gallery Cricket photos India T20 Squad for Bangladesh 2024: 5 All rounders and 5 Bowlers in Team India t20i Sqaud vs ban
IND vs BAN: ఆరుగురు ఆల్ రౌండర్లు.. ఐదుగురు బౌలర్లు.. బంగ్లాతో తలపడే టీ20 జట్టులో బ్యాటర్లు ఎవరంటే?
India vs Bangladesh: భారత్-బంగ్లాదేశ్ మధ్య టెస్టు సిరీస్‌లో రెండో మ్యాచ్ సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభం కానుంది. దీని తర్వాత అక్టోబర్ 7 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుండగా, తొలి మ్యాచ్ మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరగనుంది. ఈ సిరీస్‌కి సంబంధించి ఇప్పుడు టీమిండియాను ప్రకటించారు.
Updated on: Sep 29, 2024 | 12:39 PM

India vs Bangladesh: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో ఆరుగురు ఆల్ రౌండర్లు ఉండడం విశేషం. మరో ఇద్దరికి వికెట్ కీపర్‌గా స్థానం కల్పించారు. అలాగే, ఇద్దరు మాత్రమే పర్ఫెక్ట్ బ్యాట్స్‌మెన్స్‌గా ఎంపికయ్యారు.

ఇక్కడ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్ పర్ఫెక్ట్ బ్యాటర్లుగా కనిపించారు. అలాగే, సంజూ శాంసన్, జితేష్ శర్మలకు వికెట్ కీపర్లుగా చోటు దక్కింది. ఇషాన్ కిషన్ మరోసారి అవకాశం కోల్పోయాడు.

ఆల్ రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, ర్యాన్ పరాగ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్‌లకు అవకాశం కల్పించారు. అదేవిధంగా రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్‌లు టీమిండియాలో బౌలర్లుగా కనిపించారు.

ఈసారి సెలక్షన్ కమిటీ మరికొంతమంది ఆల్ రౌండర్లను ఎంపిక చేసినట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా అభిషేక్ శర్మ, ర్యాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి వంటి యువ ఆల్ రౌండర్లకు చోటు కల్పించారు. దీని ద్వారా, BCCI ఇప్పటికే 2026 టీ20 ప్రపంచ కప్ కోసం బలమైన జట్టును ఏర్పాటు చేయడం ప్రారంభించింది.

భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్) అభిషేక్ శర్మ, సంజు శాంసన్, రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, ర్యాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేష్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్, మే, హర్షిత్ రానా, మయాంక్ యాదవ్.

భారత్-బంగ్లాదేశ్ మధ్య టెస్టు సిరీస్‌లో రెండో మ్యాచ్ సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభం కానుంది. ఆ తర్వాత అక్టోబర్ 7 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుండగా, తొలి మ్యాచ్ మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరగనుంది. అక్టోబర్ 10న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం రెండో మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. అలాగే, ఈ సిరీస్‌లో మూడో మ్యాచ్ అక్టోబర్ 13న హైదరాబాద్‌లో జరగనుంది.




