- Telugu News Photo Gallery Cricket photos Ind vs nz 1st odi shreyas iyer special record on new zealand 1st place ms dhoni 2nd
IND vs NZ: ఎంఎస్ ధోని రికార్డ్‌ను బ్రేక్ చేసిన శ్రేయాస్ అయ్యర్.. న్యూజిలాండ్ గడ్డపై అగ్రస్థానంలో..
Shreyas Iyer Record: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో శ్రేయాస్ అయ్యర్ 80 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సందర్భంగా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని రికార్డును బద్దలు కొట్టాడు.
Updated on: Nov 25, 2022 | 7:10 PM

క్రికెట్ జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ న్యూజిలాండ్ గడ్డపై వన్డేలలో ప్రత్యేక రికార్డును నెలకొల్పడంలో విజయవంతం అయ్యాడు. ఆక్లాండ్‌లో జరుగుతున్న వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో అతను ఓ ప్రత్యేక స్థానాన్ని సాధించాడు.

ఈ మ్యాచ్‌లో అతను 80 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఓవరాల్‌గా వన్డే క్రికెట్‌లో అతనికిది 13వ అర్ధ సెంచరీ. ఇది కాకుండా, వన్డేల్లో చివరి ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో అతను ఆరో అర్ధ సెంచరీని నమోదు చేశాడు.

ఈ మ్యాచ్‌లో శ్రేయాస్ 50 పరుగులు పూర్తి చేసిన వెంటనే న్యూజిలాండ్ గడ్డపై ఎంఎస్ ధోని రికార్డును బద్దలు కొట్టాడు.

శ్రేయాస్ అయ్యర్ ఇప్పుడు న్యూజిలాండ్ గడ్డపై వరుసగా నాలుగు సార్లు 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేశాడు. కివీ గడ్డపై అతనికిది నాలుగో అర్ధ సెంచరీ. ఈ విషయంలో ఎంఎస్ ధోనీని వెనక్కునెట్టాడు.

మాజీ క్రికెటర్ ధోని గతంలో న్యూజిలాండ్‌లో వరుసగా 3 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఇప్పటి వరకు న్యూజిలాండ్‌లో జరిగిన వన్డేల్లో శ్రేయాస్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్‌తో కలిపి ఇప్పటివరకు ఇక్కడ నాలుగు మ్యాచ్‌లు ఆడాడు.

ఈ మ్యాచ్‌లన్నింటిలో అతను 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేయడంలో విజయం సాధించాడు. అంతకుముందు, శ్రేయస్ న్యూజిలాండ్‌లో మూడు మ్యాచ్‌ల్లో 103 నాటౌట్, 52, 62 పరుగులు చేశాడు. ఈరోజు నాలుగో మ్యాచ్‌లో 80 పరుగులు చేసి తిరుగులేని రికార్డ్ నెలకొల్పాడు.

శ్రేయాస్ అయ్యర్ గొప్ప బ్యాట్స్‌మెన్. ఇదిలా ఉంటే అతనికి టీమ్ ఇండియాలో ఇప్పటి వరకు సరైన అవకాశాలు రాలేదు. టీమ్ ఇండియాకు ఆడే అవకాశం వచ్చినప్పుడల్లా తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు.

శ్రేయాస్ వన్డే కెరీర్‌ను పరిశీలిస్తే.. భారత్ తరపున ఇప్పటి వరకు 34 వన్డేలు ఆడాడు. ఈ సమయంలో శ్రేయాస్ 1379 పరుగులు చేశాడు. వన్డేల్లో అతని పేరు మీద 2 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డే క్రికెట్‌లో అతని అత్యధిక స్కోరు 113 నాటౌట్.




