- Telugu News Photo Gallery Cricket photos Washington Sunder, Shreyas Iyer and Dhawan score well to take India to 306 7 in 50 overs vs New Zealand in 1st ODI
Ind vs Nz 1st ODI Score: మైదానంలో దుమ్ములేచేలా ఆడిన టీమిండియా.. న్యూజిలాండ్‌కు 307 పరుగుల లక్ష్యం
ఈ దశలో క్రిీజులో ఉన్న సంజు శామ్సన్, అయ్యర్ ఇద్దరూ కలిసి 94 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. సంజు 38 బంతులలో 36 పరుగులు సాధించారు..
Updated on: Nov 25, 2022 | 11:58 AM

న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత్ అక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ మైదానంలో ఆతిథ్య జట్టుతో తొలి వన్డే ఆడుతోంది. టీమిండియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. భారత ఆటగాళ్లలో కెప్టెన్ శిఖర్ ధావన్, శుభమాన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ అర్థ సెంచరీలు చేయగా.. ఇన్నింగ్స్ చివర్లో వాషింగ్టన్ సుందర్ విధ్వంసకరంగా ఆడాడు.

మొదటగా టాస్ గెలిచిన న్యూజిలాండ్ టీమ్ బౌలింగ్ ఎంచుకుంది. భారత ఇన్నింగ్స్‌ను నిదానంగా ప్రారంభించిన ధావన్ గిల్ జోడి తొలి వికెట్ పడేసరికి 23.1 ఓవర్లలో 124 పరుగులు చేసింది.

న్యూజిలాండ్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల్లో 1 డబుల్ సెంచరీ, ఒక సెంచరీతో మొత్తం 360 పరుగులు చేశాడు శుభ్‌మన్ గిల్. దీంతో కింగ్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును గిల్ అధిగమించి సరికొత్త రికార్డు సృష్టించాడు.

శిఖర్ ధావన్ బ్యాటింగ్ స్టైల్.

శిఖర్ ధావన్ ఔటయ్యాక.. శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి ఇన్నింగ్స్‌కు ముగింపు పలకాలి అనుకున్న పంత్ మరో సారి విఫలమయ్యాడు. 23 బంతులలో 2 ఫోర్లతో 15 పరుగులు చేసి ఫెర్గుసన్ బౌలింగ్‌లో తన వికెట్ కోల్పోయాడు. సూర్యకుమార్ యాదవ్ కూడా 4 పరుగులే చేసి పెవీలియన్ బాట పట్టాడు.

సూర్య కుమార్ తర్వాత గ్రౌండ్‌లోకి వచ్చిన సంజూ సామ్సన్.. అయ్యర్‌తో కలిసి జట్టుకు వెన్నెముకగా నిలిచారు. వీరిద్దరూ కలిసి 94 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పగా.. సంజూ 38 బంతుల్లో 36 పరుగులు చేశాడు.

ఇక చివరి ఓవర్ వరకు అద్భుత బ్యాంటింగ్‌ను కనబర్చిన అయ్యర్ 76 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 80 పరుగులు చేశాడు. సంజూ తన వికెట్ కోల్పోయిన తర్వాత బ్యాట్‌తో క్రీజులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్ కేవలం 16 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 37 పరుగులు చేశాడు.

టీమిండియా తన ఇన్నింగ్స్ ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. న్యూజిలాండ్ తరఫున ల్యూక్ ఫర్గూసన్ 10 ఓవర్లకు 3 వికెట్లను పడగొట్టి 59 పరుగులిచ్చాడు. టిమ్ సౌథీ 2 వికెట్లు, ఆడమ్ మిల్నే 1 వికెట్ తీశారు.

భారత్ తరఫున యువ ఆటగాళ్లు ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్ వన్డే ఆరంగేట్రం చేశారు.

ఇండియా ప్లేయింగ్ ఎలెవన్ శిఖర్ ధావన్(కెప్టెన్), శుభమాన్ గిల్, రిషభ్ పంత్(వైస్ కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, సంజూ సామ్సన్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీస్ సింగ్, యుజ్వేంద్ర చాహల్




