- Telugu News Photo Gallery Cricket photos IND Vs ENG: Teamindia Skipper Virat Kohli Golden Duck In 1st test vs England in Anderson Bowling
IND vs ENG: కోహ్లీని వెంటాడుతోన్న గోల్డెన్ డక్ సెంటిమెంట్.. చెత్త రికార్డుతో తొలిస్థానం
గోల్డెన్ డక్ విషయంలో కోహ్లి మరోచెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీమిండియా కెప్టెన్‌గా అత్యధికసార్లు గోల్డెన్ డక్‌గా ఔటైన లిస్టులో కోహ్లి తొలిస్థానంలో ఉన్నాడు.
Updated on: Aug 06, 2021 | 9:14 AM

Virat Kohli

అండర్సన్ వేసిన బాల్‌ను అంచనా వేయడంలలో తడబడిన కోహ్లి.. స్లిప్‌లో ఉన్న బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కోహ్లి టెస్టుల్లో గోల్డెన్ డక్‌గా వెనుదిరగడం ఇది ఐదోవసారి. ఈ ఐదింటిలో 3సార్లు ఇంగ్లండ్‌టీంతోనే కావడం విశేషం.

2014లో లార్డ్స్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో లియామ్ ప్లంకెట్ బౌలింగ్‌లో తొలిసారి గోల్డెన్ డక్‌గా వెనుదిరిగిన కోహ్లీ.. 2018లో ఓవల్ వేదికగా జరిగిన టెస్టులో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో రెండుసార్లు గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు.

తాజాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో అండర్సన్ బౌలింగ్‌లో మరోసారి గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. కాగా గోల్డెన్ డక్ విషయంలో కోహ్లి మరోచెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. టీమిండియా కెప్టెన్‌గా 3సార్లు గోల్డెన్ డక్‌గా వెనుదిరిగిన కోహ్లి తొలిస్థానంలో ఉన్నాడు. లాలా అమర్‌నాథ్, కపిల్ దేవ్, సౌరవ్ గంగూలీలు టెస్టు కెప్టెన్లుగా రెండు సార్లు గోల్డెన్ డక్‌గా ఔట్ అయ్యారు.

ఇక అండర్సన్ 12 టెస్టుల తర్వాత కోహ్లిని అవుట్ చేయడం మరో విశేషం. చివరగా 2014లో ఓల్డ్ ట్రాఫర్డ్ టెస్టులో కోహ్లిని అండర్సన్ అవుట్ చేశాడు.




