- Telugu News Photo Gallery Cricket photos IND vs BAN 1st Test: Hasan Mahmud becomes first Bangladesh bowler to take 5 wickets haul in India in Tests
IND vs BAN: వార్నీ.. 4వ టెస్ట్‌లోనే 2వసారి ఇలా.. బ్యాటర్ల దిమాక్ ఖరాబ్ చేస్తోన్న ఖతర్నాక్ బౌలర్
Hasan Mahmud: కేవలం నాలుగో టెస్టు ఆడుతున్న 24 ఏళ్ల బంగ్లా పేసర్ హసన్ మహమూద్ టీమిండియా ప్లేయర్స్ రోహిత్ శర్మ (19 బంతుల్లో 6), శుభ్‌మన్ గిల్ (8 బంతుల్లో 0), విరాట్ కోహ్లీ (6 బంతుల్లో 6), రిషబ్ పంత్ (52 బంతుల్లో 39)లను అవుట్ చేశాడు. ఈ వికెట్లన్నీ తొలిరోజు పడగొట్టాడు.
Updated on: Sep 20, 2024 | 12:05 PM

శుక్రవారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో భారత్‌లో 5 వికెట్లు తీసిన బంగ్లాదేశ్‌కు చెందిన తొలి బౌలర్‌గా హసన్ మహమూద్ నిలిచాడు.

కేవలం నాలుగో టెస్టు ఆడుతున్న 24 ఏళ్ల బంగ్లా పేసర్ హసన్ మహమూద్ టీమిండియా ప్లేయర్స్ రోహిత్ శర్మ (19 బంతుల్లో 6), శుభ్‌మన్ గిల్ (8 బంతుల్లో 0), విరాట్ కోహ్లీ (6 బంతుల్లో 6), రిషబ్ పంత్ (52 బంతుల్లో 39)లను అవుట్ చేశాడు. ఈ వికెట్లన్నీ తొలిరోజు పడగొట్టాడు.

అలాగే, రెండో రోజు జస్ప్రీత్ బుమ్రాను ఔట్ చేసి తన 5 వికెట్ల ప్రదర్శనను పూర్తి చేశాడు. మహమూద్ 83 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. దీంతో భారత్ 376 పరుగులకు ఆలౌట్ అయింది.

తొలిరోజు సెంచరీ చేసిన రవిచంద్రన్ అశ్విన్ 113 పరుగులు చేయగా, రవీంద్ర జడేజా 86 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఈరోజు అతను పరుగులు చేయలేకపోయాడు. ఆకాశ్ దీప్ 17 పరుగులు, జస్ప్రీత్ బుమ్రా 7 పరుగులు చేశారు.

టెస్టుల్లో హసన్ మహమూద్‌కిది వరుసగా రెండోసారి ఇలా ఐదు వికెట్లు పడగొట్టాడు. గత నెలలో రావల్పిండిలో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో పాకిస్థాన్‌పైనా 5/43తో చెలరేగిపోయాడు.




