- Telugu News Photo Gallery Cricket photos IND vs AUS Final: Team India Set To Create History Check Rohit Sharma Team Journey To The Finals Of The ICC World Cup 2023
ICC World Cup: చరిత్ర సృష్టించడానికి ఒక్క అడుగు దూరంలో టీమిండియా.. టోర్నీలో రోహిత్ సేన ప్రయాణం ఎలా సాగిందంటే..
భారత క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించడానికి ఒక అడుగు దూరంలో ఉంది. ICC ODI ప్రపంచ కప్ ఫైనల్ పోటీ నేడు జరగనుంది. కప్ కోసం భారత దేశం ఆస్ట్రేలియా తలపడనున్నాయి. స్వదేశీ గడ్డపై జరగనున్న ఈ సమరంలో భారత్ విజయం సొంతం చేసుకోవాలంటూ ప్రతి భారతీయులు కోరుకుంటున్నాడు. దేవుళ్ళకు పూజలను చేస్తున్నారు. మరోవైపు స్టేడియం వద్ద సందడి మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రపంచ కప్ పోటీల్లో భారత క్రికెట్ జట్టు ప్రయాణం ఎలా జరిగిందో ఇప్పుడు ఒక్కసారి చూద్దాం.. 2023 ప్రపంచ కప్ లో భారత ప్రయాణం ఎలా సాగిందంటే..
Updated on: Nov 19, 2023 | 12:01 PM

2023 ప్రపంచకప్ ఫైనల్ పోరు నేడు జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో టైటిల్ కోసం రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్, పాట్ కమిన్స్ కెప్టెన్సీలోని ఆస్ట్రేలియా జట్లతో తలపడనుంది.

ఆస్ట్రేలియాతో భారత్ తొలి మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే భారత బౌలర్లు ఆస్ట్రేలియాను 199 పరుగులకే పరిమితం చేశారు. లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. జట్టులోని ముగ్గురు ప్రముఖ బ్యాట్స్‌మెన్‌లు తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. అయితే విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు.

భారత్ రెండో మ్యాచ్ ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. భారత్ 35 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని పూర్తి చేసుకుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 84 బంతుల్లో 131 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.

భారత్ తన మూడో మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో తలపడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ కేవలం 42.5 ఓవర్లలో 191 పరుగులకే ఆలౌటైంది. అనంతరం పాక్ నిర్దేశించిన లక్ష్యాన్ని టీమిండియా 30.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ అర్ధశతకాలు సాధించారు.

బంగ్లాదేశ్‌తో భారత్ నాలుగో మ్యాచ్. తొలుత టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. భారత్ 41.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. విరాట్ కోహ్లీ 103 నాటౌట్, శుభ్‌మన్ గిల్ 53, రోహిత్ శర్మ 48 పరుగులు చేశారు.

భారత్ ఐదో మ్యాచ్ న్యూజిలాండ్ తో జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 50 ఓవర్లలో 273 పరుగులు చేసింది. భారత్ 48వ ఓవర్లో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 95 పరుగులు, రోహిత్ శర్మ 46 పరుగులు, రవీంద్ర జడేజా 39 పరుగులు చేశారు.

ఇంగ్లండ్‌తో భారత్ ఆరో మ్యాచ్ ఆడింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. అయితే ఇంగ్లాండ్ జట్టు 34.5 ఓవర్లలో 129 పరుగులకే ఆలౌటైంది. షమీ 4 వికెట్లు, బుమ్రా 3 వికెట్లు తీశారు.

ఏడో మ్యాచ్‌లో భారత్ శ్రీలంకతో తలపడింది. తొలుత టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ చేసింది. దీంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. అయితే శ్రీలంక జట్టు 19.4 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌటైంది.

భారత్ ఎనిమిదో మ్యాచ్ దక్షిణాఫ్రికాతో తలపడింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు రంగంలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు 83 పరుగులకే ఆలౌటైంది. భారత్ తరఫున రవీంద్ర జడేజా 5, కుల్దీప్ 2, షమీ 2 వికెట్లు తీశారు.

భారత్‌కు తొమ్మిదోది.. చివరి లీగ్ మ్యాచ్ నెదర్లాండ్స్‌తో జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేసింది. 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. నెదర్లాండ్స్ 47.5 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది.

నిర్ణయాత్మక సెమీ-ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడింది. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది. న్యూజిలాండ్ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ సగర్వంగా ఫైనల్ లో అడుగు పెట్టింది.




