WTC Finals 2023: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ షెడ్యూల్ వచ్చేసింది.. మరి ఫైనల్‌లో భారత్ ఉంటుందా..? చూద్దాం రండి..

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2023 ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందనే క్రికెట్ అభిమానుల ప్రశ్నలకు ఐసీసీ సమాధానం ఇచ్చింది. ఐసీసీ తన తాజా ప్రకటనలో డబ్య్లూటీసీ ఫైనల్ 2023 వేదికను, తేదీని ప్రకటించింది.

|

Updated on: Feb 09, 2023 | 6:57 AM

ఐసీసీ ఈ ఏడాది జరగబోయే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2023 తేదిని ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం(ఫిబ్రవరి 7) ఓ ప్రకటనను విడుదల చేసింది. ఆ ప్రకటన ప్రకారం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఈసారి లండన్‌లోని ఓవల్ మైదానంలో జరగనుంది.

1 / 5
  ఈ మ్యాచ్ జూన్ 7 నుంచి ఓవల్ మైదానంలో ప్రారంభం కానుంది. దీంతో పాటు ఫైనల్స్‌కు ఒక రోజు రిజర్వ్ కూడా ఉంచారు. అయితే వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్‌కు అంతరాయం కలిగితే, ఈ మ్యాచ్ జూన్ 12న కూడా ఆడవచ్చు.

2 / 5
ఐసిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ తొలి ఫైనల్‌(2021)లో న్యూజిలాండ్‌ చేతిలో భారత్ ఓటమిని చవిచూడాల్సి వచ్చిందని మనందరికీ తెలుసు. మరి ఈసారి కూడా టీమ్ ఇండియా ఫైనల్స్‌కు చేరుకునే రేసులో ఉంది. అన్నీ కలిసి వస్తే ఈసారి ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడవచ్చు.

3 / 5
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ 2023లో భారత్ ఫైనల్‌కు చేరుకోవాలంటే, ఆస్ట్రేలియాతో జరిగే 4 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో కనీసం 3 మ్యాచ్‌లు గెలవాల్సి ఉంటుంది. ఆ క్రమంలో భారత్ 3-1 తేడాతో ఆస్ట్రేలియాను ఓడించినా, లేదా 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకున్నా.. ఫైనల్‌లో ఎంట్రీ ఖరారు అయినట్లే.

4 / 5
  లేదా 2-0 తేడాతో ఈ టెస్ట్ సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకుంటే.. న్యూజిలాండ్-శ్రీలంక, వెస్టిండీస్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగనున్న టెస్టు సిరీస్ ఫలితాలపైనే ఆధారపడాల్సి ఉంటుంది. ఇప్పుడు కూడా పరిస్థితి అలాగే ఉంది.  మరి ఈ నేపథ్యంలో జూన్ 7న ఒవల్ వేదికగా జరగబోయే ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో ఏ జట్టు తలపడుతుందో వేచి చూడాలి.

5 / 5
Follow us