- Telugu News Photo Gallery Cricket photos AUS vs IND, 1st Test: Australia records 2nd lowest total at home against India in Perth
AUS vs IND, 1st Test: పెర్త్‌లో పరువుపాయే.. 50 ఏళ్ల చెత్త రికార్డులో ఆస్ట్రేలియా..
Australia vs India, 1st Test: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్లు పెర్త్ వేదికగా తొలి టెస్ట్‌లో తలపడుతున్నాయి. ఈ క్రమంలో తొలి రెండు రోజుల్లో అనే రికార్డులు నమోదయ్యాయి. ఇందులో ఆస్ట్రేలియా పేరిట ఓ చెత్త రికార్డ్ కూడా నమోదైంది.
Updated on: Nov 23, 2024 | 11:00 AM

పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో జరుగుతోన్న మొదటి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ 2వ రోజు ఆస్ట్రేలియా తన స్వదేశంలో భారత్‌పై రెండవ అత్యల్ప టెస్ట్ స్కోరును నమోదు చేసింది.

భారత్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆస్ట్రేలియా జట్టును 104 పరుగులకు ఆలౌట్ చేసింది. భారత కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు పడగొట్టి కీలక పాత్ర పోషించాడు.

1981లో మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియా అత్యల్ప స్కోరు నమోదు చేసింది. కపిల్ దేవ్ అద్భుత బౌలింగ్‌తో ఆస్ట్రేలియా కేవలం 83 పరుగులకే ఆలౌట్ అయింది.

భారత్‌పై స్వదేశంలో ఆస్ట్రేలియా అత్యల్ప స్కోర్లు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం. 1981లో మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియా జట్టు కేవలం 83 ఆలౌట్ అయింది. ఆ తర్వాత 2024లో అడిలైడ్‌లో 104 పరుగులు, 1974లో సిడ్నీలో 107 పరుగులకే ఆలౌట్ అయింది.

ఆ తర్వాత 1978లో సిడ్నీలో 131 పరుగులకే ఆలౌట్ అయిన ఆస్ట్రేలియా, 1992లో అడిలైడ్‌లో 145 ఆలౌట్ అయింది.




