- Telugu News Photo Gallery Cricket photos AUS vs ENG: England Player Ben Duckett smashes century against Australia in ICC Champions Trophy 2025
AUS vs ENG: 12 బౌండరీలతో తుఫాన్ సెంచరీ.. లాహోర్‌లో కంగారుల నడ్డి విరిచిన ఐపీఎల్ అన్‌లక్కీ ప్లేయర్
England Player Ben Duckett smashes century: 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో నాల్గవ మ్యాచ్ ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరుగుతోంది. గ్రూప్ బిలో జరిగిన రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఇంగ్లండ్ జట్టు భారీ స్కోర్ దిశగా ముందుకు సాగుతోంది.
Updated on: Feb 22, 2025 | 5:22 PM

శనివారం లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతోన్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఆటగాడు బెన్ డకెట్ సెంచరీ సాధించాడు. వన్డేల్లో 3వ సెంచరీ సాధించాడు. దీంతో ఆస్ట్రేలియా ముందు భారీ స్కోర్ ఉంచేందుకు ప్రయత్నిస్తున్నాడు.

ఈ ఎడమచేతి వాటం ఓపెనర్ స్పెన్సర్ జాన్సన్ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లతో 95 బంతుల్లో తన మూడో వన్డే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అతని ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి.

ఈ మ్యాచ్‌తో కలిసి ఛాంపియన్స్ ట్రోపీ 2025లో ఇప్పటి వరకు 6 సెంచరీలు నమోదయ్యాయి. డకెట్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. ఫిల్ సాల్ట్ మ్యాచ్‌లోని రెండవ ఓవర్‌లో అలెక్స్ కారీ మిడ్-ఆన్‌లో అద్భుతమైన క్యాచ్ పట్టడంతో అవుట్ అయ్యాడు.

ఆ తర్వాత బెన్ డకెట్ జేమీ స్మిత్‌తో కలిసి 30 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. జో రూట్‌తో కలిసి మూడో వికెట్‌కు 158 పరుగులు జోడించి ఇంగ్లాండ్‌ను పటిష్ట స్థితిలో ఉంచాడు.

ప్రస్తుతం వార్త రాసే సమయానికి 35 ఓవర్లలో ఇంగ్లాండ్ 4 వికెట్లకు 226 పరుగులు చేసింది. బెన్ డకెట్, జోస్ బట్లర్ క్రీజులో ఉన్నారు. వికెట్లు తీసేందుకు ఆస్ట్రేలియా బౌలర్లు ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నారు.




