Asian Games 2023: చరిత్ర సృష్టించిన యశస్వీ జైస్వాల్.. గిల్, రైనా రికార్డులు బ్రేక్.. తొలి సెంచరీతోనే ఆ లిస్టులో అగ్రస్థానం.. 

Asian Games 2023: చైనాలోని హాంగ్‌జౌలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ క్రికెట్ జట్టు సెమీ ఫైనల్స్‌కి చేరుకుంది. నేపాల్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో 23 పరుగుల తేడాతో విజయం సాధించడంతో టీమిండియా మార్గం సుగమమైంది. ఇక ఈ విజయంలో యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ ప్రధాన పాత్ర పోషించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగి ఆసియా క్రీడల్లో భారత్‌కి తొలి సెంచరీ, తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో తొలి టీ20 శతకాన్ని సాధించాడు. అంతే కాదు.. శుభమాన్ గిల్, సురేష్ రైనా పేరిట ఉన్న ఓ అరుదైన రికార్డును తన సొంతం చేసుకున్నాడు. 

|

Updated on: Oct 03, 2023 | 11:19 AM

Asian Games 2023: నేపాల్‌తో జరిగిన ఆసియా క్రీడలు క్రికెట్ క్వార్టర్ ఫైనల్స్‌లో యశస్వీ జైస్వాల్ మెరుపు సెంచరీ చేశాడు. 8 ఫోర్లు, 7 సిక్సర్లతో తొలి అంతర్జాతీయ టీ20 సెంచరీ నమోదు చేశాడు. 

1 / 5
యశస్వీ 48 బంతుల్లోనే సాధించిన ఈ శతకం భారత్ తరఫున 5వ ఫాస్టెస్ట్ సెంచరీ కూడా కావడం విశేషం.

2 / 5
అలాగే నేపాల్‌పై సాధించిన ఈ సెంచరీతో యశస్వీ.. భారత్ తరఫున టీ20 శతకం సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా కూడా రికార్డులను తిరగరాసి, అగ్రస్థానాన్ని అధిరోహించాడు.

3 / 5
గతంలో ఈ రికార్డ్ శుభమాన్ గిల్ పేరిట ఉండేది. 23 సంవత్సరాల 146 రోజుల వయసులో గిల్ టీ20 సెంచరీ చేయగా.. యశస్వీ 21 ఏళ్ల 279 రోజుల వయసులోనే ఈ ఫీట్ చేశాడు.

4 / 5
ఇలా అత్యంత పిన్న వయసులోనే టీ20 సెంచరీ చేసిన భారత్ ఆటగాళ్లుగా యశస్వీ అగ్రస్థానంలో, గిల్ రెండో స్థానంలో ఉండగా.. 23 ఏళ్ల 156 రోజుల వయసులోనే సెంచరీ చేసిన సురేష్ రైనా మూడో స్థానంలో ఉన్నాడు.

5 / 5
Follow us