- Telugu News Photo Gallery Cricket photos 7th consecutive series at home odi bilateral series wins for india india vs new zealand rohit sharma
Team India: ఇంగ్లండ్ నుంచి ఆస్ట్రేలియా వరకు.. ఏ జట్టొచ్చినా తోకముడుచుడే.. స్వదేశంలో తిరుగులేని భారత్ రికార్డ్..
రెండో వన్డేలో న్యూజిలాండ్‌ను ఓడించడం ద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0తో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది.
Updated on: Jan 22, 2023 | 6:52 AM

వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్ జాబితాలో రోహిత్ శర్మ మూడో స్థానంలో నిలిచాడు. మరి వన్డే క్రికెట్‌లో ఇప్పటివరకు అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్ ఎవరో చూద్దాం..

కాగా, అంతర్జాతీయ క్రికెట్‌లో 494 మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లీ.. 300 క్యాచ్‌లు అందుకున్నాడు. తద్వారా భారత్ తరఫున ఈ ఘనత సాధించిన 2వ భారత ఆటగాడిగా, అలాగే ప్రపంచ క్రికెట్‌లో 7వ ప్లేయర్‌గా కింగ్ కోహ్లీ అవతరించాడు.

2009 నుంచి 2011 వరకు స్వదేశంలో భారత్ వరుసగా ఆరు వన్డే సిరీస్‌లను గెలుచుకుంది. 2016 నుంచి 2018 వరకు, టీమిండియా స్వదేశంలో ఇదే పని చేసి ఆరు ద్వైపాక్షిక సిరీస్‌లను కైవసం చేసుకుంది.

2013 నుంచి 2014 వరకు టీమిండియా స్వదేశంలో వరుసగా ఐదు ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లను గెలుచుకోవడంలో విజయవంతమైంది.

2016 నుంచి స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా ఒక్కసారి మాత్రమే ఓడిపోయింది. 2019లో స్వదేశంలో జరిగిన మూడు మ్యాచ్‌ల ODI సిరీస్‌లో ఆస్ట్రేలియా భారత్‌ను ఓడించింది.




