Venkata Chari |
Updated on: Jan 24, 2023 | 10:26 AM
భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ గత సంవత్సరం నుంచి ప్రదర్శన అద్భుతంగా సాగుతోంది. అదే ఫామ్‌ను కొనసాగిస్తూ ఈ ఏడాదిని కూడా ఎంతో గ్రాండ్‌గా మొదలుపెట్టాడు.
సిరాజ్ పవర్‌ప్లేలో రారాజుగా నిలిచాడు. అలాగే పరుగులు ఇవ్వడంలో చాలా పరికితనంగా కనిపిస్తున్నాడు.
Mohammed Siraj
సిరాజ్ 2022 సంవత్సరం నుంచి 17 మెయిడిన్ ఓవర్లు వేశాడు. దీని తర్వాత 14 మెయిడిన్ ఓవర్లు బౌలింగ్ చేసిన ఆస్ట్రేలియాకు చెందిన జోష్ హేజిల్‌వుడ్ రెండవ స్థానంలో ఉన్నాడు. 10 మెయిడిన్లు వేసిన ట్రెంట్ బౌల్ట్ మూడో స్థానంలో ఉన్నాడు.
ఈ ఏడాది ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన సిరాజ్ 15 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది ఇప్పటివరకు భారత్ తరపున అత్యంత విజయవంతమైన బౌలర్‌గా నిలిచాడు.