చేపలను పెరుగుతో తింటున్నారా.? రోగాలకు వెల్కమ్ చెప్పినట్టే
ఆరోగ్యం కారణంగా చేపలను చాలామంది తింటారు. వీటిలోని ఒమేగా 3 ఆమ్లాలు గుండెకు ఎంతగానే మేలు చేస్తాయి. అలాగే జుట్టు, చర్మానికి కూడా మంచివి. అయితే కొంతమంది వీటిని పెరుగుతో కలిపి తినడానికి ఇష్టపడతారు. చేపలను పెరుగుతో కలిపి తీసుకోవడం వల్ల అనేక దుష్ప్రభావాలు కలుగుతాయని నిపుణులు అంటున్నారు. మరి అవేంటో ఈరోజు తెలుసుకుందామా..
Updated on: Aug 02, 2025 | 6:00 PM

చేపలు ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం.పెరుగు పాల ఉత్పత్తి కావడంతో ఇందులో క్యాల్షియం ఉంటుంది. ఈ రెండింటిని కలిపి తినడం వల్ల జీర్ణవ్యవస్థపై భారం పడుతుంది. ప్రోటీన్, పాల ఉత్పత్తుల కలయిక జీర్ణవ్యవస్థలో గ్యాస్ ఉత్పత్తికి కారణమవుతుంది. దీనివల్ల అసౌకర్యం, ఉబ్బరం వంటివి వస్తాయి. చేపలలో ఉండే అధిక ప్రోటీన్ కంటెంట్ పెరుగుతో కలిపినప్పుడు ఆమ్లత్వాన్ని ప్రేరేపిస్తుంది. ముఖ్యంగా యాసిడ్ రిఫ్లక్స్ బారిన పడేవారికి.

మీకు అలెర్జీ ఉంటే చేపలు, పెరుగు కలిపి తీసుకోవడం వల్ల చర్మంపై దద్దుర్లు, దురదకు కారణం అవుతాయి. జీర్ణ సమస్యలు, అలెర్జీలు సంభవించవచ్చు. ఆయుర్వేదంలో కూడా చేపలను ఆరోగ్యకరమైన ఆహారంగా పరిగణిస్తారు. కానీ దానిని పెరుగుతో కలపడం వల్ల కఫం పెరుగుతుంది. ఫలితంగా దగ్గు వస్తుంది. ఇది తీవ్రం అయితే అనారోగ్య సమస్యలు వస్తాయి.

చేపలు, పెరుగు కలిపి తీసుకొంటే శరీరంలో శ్లేష్మం పెరుగుదలకు దారితీస్తుంది. ఇది శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి ప్రమాదం అంటున్నారు నిపుణులు. అధిక ప్రోటీన్, కేలరీల కంటెంట్ కారణంగా చేపలు, పెరుగు కలిపి తినడం బరువు పెరగడానికి దోహదం చేస్తుంది. అధిక బరువు సమస్య ఉన్నారు ఈ రెండు కలిపి తినకపోవడమే మంచిదని నిపుణులు మాట.

జీర్ణవ్యవస్థలో అసౌకర్యాన్ని నివారించడానికి చేపలు, పెరుగును మితంగా తీసుకోండి. ఆహారం ద్వారా వచ్చే అనారోగ్య ప్రమాదాన్ని తగ్గించడానికి చేపలు, పెరుగు రెండూ తాజాగా, మంచి నాణ్యతతో ఉన్నవి మాత్రమే ఎంపిక చేసుకోండి. చేపలు, పెరుగు కలిపి తినేవారు కూరగాయలు లేదా తృణధాన్యాలు వంటి ఇతర ఆహారాలతో మీ భోజనాన్ని సమతుల్యం చేసుకోండి.

యాసిడ్ రిఫ్లక్స్, గ్యాస్ట్రిటిస్ లేదా ఇతర జీర్ణ సమస్యలు ఉన్నవారు చేపలు, పెరుగు కలయికను పరిమితం చేయడం లేదా నివారించడం మంచిది. మీకు చేపలు లేదా పాల ఉత్పత్తులకు అలెర్జీ ఉంటే, ఈ కలయికను పూర్తిగా నివారించండి. ఉబ్బసం వంటి శ్వాసకోశ సమస్యలు ఉన్నవారిలో శ్లేష్మం ఉత్పత్తి పెరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలి. పెరుగుతో చేపలు తిన్న తర్వాత మీకు ఏవైనా సమస్యలు ఉంటె వెంటనే డాక్టర్ని సంప్రదించండి.




