Constipation: ఈ సీజన్‌లో వీటికి దూరంగా ఉండకపోతే మలబద్ధకం సమస్య గ్యారెంటీ..

మలబద్ధకం సమస్యతో బాధ పడేవారు ఈ సీజన్‌లో మరింత జాగ్రత్త పాటించాలి. కొన్ని రకాల ఆహారాలను తీసుకోపోవడమే మంచిది. వీటి వలన ఈ సమస్య మరింత పెరుగుతంది. కాబట్టి చలి కాలంలో ఈజీగా అరిగిపోయే ఆహారాలను తీసుకోవడమే మేలు. మరి ఆ ఫుడ్స్ ఏంటో చూడండి..

Chinni Enni

|

Updated on: Jan 12, 2025 | 4:12 PM

మలబద్ధకం సమస్యను చాలా మంది ఈజీగా తీసుకుంటారు. కానీ మలబద్ధకం సమస్యను అలాగే వదిలేస్తే పైల్స్ సమస్యకు దారి తీస్తుంది. అంతే కాకుండా గ్యాస్, అసిడిటీ, తల నొప్పి, మైగ్రేన్ వంటి ఇతర సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

1 / 5
మలబద్ధకం సమస్యతో బాధ పడుతున్నారు.. ఆహారాలు తీసుకునే విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. అందులోనూ ఈ సీజన్‌లో కొన్ని రకాల ఫుడ్స్‌కి చాలా దూరంగా ఉండాలి. లేదంటే మాత్రం ఇబ్బందులు ఎదుర్కొనాల్సిందే.

మలబద్ధకం సమస్యతో బాధ పడుతున్నారు.. ఆహారాలు తీసుకునే విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. అందులోనూ ఈ సీజన్‌లో కొన్ని రకాల ఫుడ్స్‌కి చాలా దూరంగా ఉండాలి. లేదంటే మాత్రం ఇబ్బందులు ఎదుర్కొనాల్సిందే.

2 / 5
ఈ సీజన్‌లో ఆవు పాలకు చాలా దూరంగా ఉండాలి. ఇందులో ఉండే ప్రోటీన్.. మలబద్ధకం సమస్యను కలిగిస్తుంది. పిజ్జా, చిప్స్, బజ్జీలు వంటి ఆహారాలను కూడా తీసుకోకూడదు. నూనెలో వేయించిన ఆహారాలు తీసుకుంటే జీర్ణ సమస్యలు రావడం పక్కా.

3 / 5
అదే విధంగా మైదా పిండితో తయారు చేసిన ఆహారాలను కూడా మితంగా తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే మాత్రం మలబద్ధకం సమస్యకు దారి తీస్తుంది. మటన్ కూడా తక్కువగా తినాలి.

అదే విధంగా మైదా పిండితో తయారు చేసిన ఆహారాలను కూడా మితంగా తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే మాత్రం మలబద్ధకం సమస్యకు దారి తీస్తుంది. మటన్ కూడా తక్కువగా తినాలి.

4 / 5
పంచదారతో చేసిన ఆహారాలను కూడా తక్కువగా తీసుకుంటేనే మంచిది. చాక్లెట్స్, స్వీట్స్ వంటివి తిన్నా మలబద్ధకం తలెత్తవచ్చు. కాబట్టి ఈ సీజన్‌లో ఈజీగా అరిగే ఆహారాలను తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

పంచదారతో చేసిన ఆహారాలను కూడా తక్కువగా తీసుకుంటేనే మంచిది. చాక్లెట్స్, స్వీట్స్ వంటివి తిన్నా మలబద్ధకం తలెత్తవచ్చు. కాబట్టి ఈ సీజన్‌లో ఈజీగా అరిగే ఆహారాలను తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

5 / 5
Follow us