- Telugu News Photo Gallery Cinema photos YRF Spy Universe is continuing the same tradition with heroines in War 2 as well
War Heroines: వార్ 2 హీరోయిన్స్ విషయంలోనూ అదే సాంప్రదాయం కంటిన్యూ.. ఏంటది.?
వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో యాక్షన్ మాత్రమే కాదు... గ్లామర్ మూవీ ఎప్పుడు హాట్ టాపికే. ఇప్పటి వరకు ఈ సిరీస్‌లో వచ్చిన సినిమాల్లో హీరోయిన్లంతా అల్ట్రా గ్లామరస్ లుక్స్‌లో అదరగొట్టారు. ఇప్పుడు వార్ 2లోనూ అదే సాంప్రదాయాన్ని కంటిన్యూ చేసింది యూనిట్.
Updated on: May 25, 2025 | 3:40 PM

సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ఏక్తా టైగర్ సినిమాతో స్పై యూనివర్స్ ప్రారంభమైంది. ఈ సినిమాలో కత్రినా కైఫ్ హీరోయిన్‌గా కనిపించారు. కథ పరంగా పాకిస్థానీ ఏజెంట్‌గా కనిపించిన క్యాట్‌కు ఏక్తా టైగర్‌తో పాటు టైగర్ జిందాహైలోనూ పెద్దగా గ్లామర్ యాంగిల్ చూపించే ఛాన్స్ దక్కలేదు. కానీ రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ రేంజ్‌లో గ్లామర్ షో చేశారు క్యాట్.

వార్ సిరీస్‌లో వచ్చిన తొలి సినిమాలో వాణీ కపూర్ హృతిక్‌కు జోడీగా నటించారు. కథ పరంగా ఆమె క్యారెక్టర్‌కు పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోయినా.. తన గ్లామర్ షోతో అందరికీ గుర్తుండిపోయారు ఈ బ్యూటీ. ముఖ్యంగా గుంగ్రూ సాంగ్‌లో వాణీ బికినీ షో, స్పై యూనివర్స్‌కు కొత్త కలర్ యాడ్ చేసింది.

పఠాన్ సినిమాతో స్పై యూనివర్స్‌లోకి అడుగుపెట్టిన షారూఖ్ కూడా తన సినిమాలో గ్లామర్‌కి మ్యాగ్జిమమ్ స్పేస్ ఇచ్చారు. ఆ సినిమాలో దీపిక గ్లామరస్ లుక్స్ అప్పట్లో హాట్ టాపిక్ అయ్యాయి. ముఖ్యంగా దీపిక ఆరెంజ్ బికినీ మీద పెద్ద రచ్చే జరిగింది.

టైగర్ 3 విషయంలో క్యాట్ కూడా కాస్త హీట్ పెంచారు. బికినీ రేంజ్‌లో కాకపోయినా... గత రెండు చిత్రాలతో పోలిస్తే హట్ అనిపించే రేంజ్‌లో అదరగొట్టారు. అయితే ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది.

ఇప్పుడు ఇదే గ్లామర్ షో సాంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తూ వార్ 2లో బికినీలో వావ్ అనిపించారు కియారా అద్వానీ. ఇందులో ఆమె తారక్ సరసన కనిపించనున్నారు. ఈ సినిమా ఆగష్టు 14న ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతుంది.




