- Telugu News Photo Gallery Cinema photos Will Pawan Kalyan, Sreeleela Ustaad Bhagat Singh movie release next year?
Sreeleela: శ్రీలీల హిట్ కొట్టాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందేనా..
కన్నడ ఇండస్త్రీనుంచి వచ్చిన బ్యూటీస్ లో శ్రీలీల ఒకరు. పెళ్లి సందడి సినిమాతో ఈ చిన్నది తెలుగులో పరిచయం అయ్యింది. అంతకు ముందు కన్నడ ఇండస్ట్రీలో చేసింది మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ క్యూటీ బ్యూటీ.
Updated on: May 18, 2024 | 3:57 PM

కన్నడ ఇండస్త్రీనుంచి వచ్చిన బ్యూటీస్ లో శ్రీలీల ఒకరు. పెళ్లి సందడి సినిమాతో ఈ చిన్నది తెలుగులో పరిచయం అయ్యింది. అంతకు ముందు కన్నడ ఇండస్ట్రీలో చేసింది మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ క్యూటీ బ్యూటీ.

తొలి సినిమాలోనే తన అందం, చలాకీ తనంతో ఆకట్టుకుంది శ్రీలీల. టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ అందుకుంది. యంగ్ హీరోలందరి సరసన నటించే ఛాన్స్ అందుకుంది. అలాగే మాస్ రాజా రవితేజతో ధమాకా చేసి హిట్ అందుకుంది.

రోజుకో కొత్త ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి వస్తున్నా.. టాలీవుడ్‌కు ఆ హీరోయిన్స్ కొరత మాత్రం తీరట్లేదు. దాంతో దర్శక నిర్మాతలకు చుక్కలు కనిపిస్తూనే ఉన్నాయి. నిన్నటి వరకు నెం 1 అనుకున్న శ్రీలీలకు ఇప్పుడు సినిమాలే లేవు.. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ ఉన్నా.. ఇప్పట్లో మొదలు కాదు.

ఇక ఇప్పుడు ఈ అమ్మడు జోరుకు బ్రేకులు పడ్డాయని తెలుస్తోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడం కంటే ఆచితూచి అడుగులేయడం బెటర్ అని భావిస్తుంది శ్రీలీల . ప్రస్తుతం ఈ చిన్నదాని చేతిలో బడా సినిమా ఒక్కటే ఉంది.

అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్. ప్రస్తుతం పవన్ వరుసగా సినిమాలను లైనప్ చేశారు. హరిహర వీర మల్లు, ఓజీ సినిమాల తరవాత భగత్ సింగ్ సినిమా రానుంది. అంటే ఈ సినిమా వచ్చేది వచ్చే ఏడాదే.. దాంతో శ్రీలీల సాలిడ్ సక్సెస్ కొట్టాలంటే వచ్చే ఏడాది వరకు ఎదురుచూడాల్సిందే అన్నమాట.




