- Telugu News Photo Gallery Cinema photos Will director Nelson Dilipkumar get a pan India hit with Jr. NTR similar like director Atlee
Nelson Dilipkumar: అట్లీ రూట్ లో నెల్సన్.. ప్లాన్ వర్కవుట్ అయ్యేనా
నన్నొక్కడిని నార్త్ లో గెలిపించండి. సౌత్ నుంచి వంద మందిని ఉత్తరాదికి తీసుకెళ్తాను అని జవాన్ వేడుకలో గట్టిగా చెప్పారు అట్లీ. ఇప్పుడు ఆయన రూట్లోనే ట్రావెల్ చేయడానికి సిద్ధమయ్యారు నెల్సన్. అయితే అట్లీగానీ, నెల్సన్‌గానీ, ప్యాన్ ఇండియా ఎస్టాబ్లిష్‌మెంట్‌కి కోలీవుడ్ హీరోలను నమ్ముకోలేదు.. మరి వాళ్ల కెరీర్‌కి గేమ్ చేంజర్స్ ఎవరు?
Updated on: Feb 12, 2025 | 8:02 PM

బాలీవుడ్ బాద్షా షారుఖ్.. అట్లీకి కాల్షీట్ ఇచ్చారనే మాట వినగానే.. అందరూ అంతలా ఏం చెప్పి మెప్పించారని అవాక్కయ్యారు. ఎక్స్ పెక్టేషన్స్ కి తగ్గట్టుగానే వెయ్యి కోట్ల సినిమాను ఇచ్చేశారు అట్లీ.

నార్త్ హీరోలకు తెలియని మాస్‌ని సౌత్ కెప్టెన్లు భలేగా ప్రెజెంట్ చేస్తున్నారనే కాంప్లిమెంట్స్ అందుకున్నారు అట్లీ. ఇప్పుడు లేటెస్ట్ గా అల్లు అర్జున్‌తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు అట్లీ.

త్రివిక్రమ్ - బన్నీ సినిమా కంప్లీట్ కాగానే... అట్లీ ఐకాన్‌స్టార్ సినిమా స్టార్ట్ అవుతుంది. ప్యాన్ ఇండియా లెవల్లో అట్లీ చేస్తున్న ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్టులోనూ కోలీవుడ్ హీరో లేకపోవడం ఇప్పుడు కోడంబాక్కం సర్కిల్స్ లో డిస్కసింగ్ పాయింట్ అయింది.

ఎవరేం అనుకున్నా ఫర్వాలేదు.. అట్లీ రూట్లోనే ట్రావెల్ చేయాలని ఫిక్స్ అయిపోయారు నెల్సన్. అందుకే ఆయన కూడా పొరుగు హీరో మీదే హోప్స్ పెట్టుకున్నారు. డార్క్ యాక్షన్ కామెడీతో కోట్లు కొల్లగొట్టేస్తారని పేరు తెచ్చుకున్నారు నెల్సన్. ఈయన కైండ్ ఆఫ్ సినిమాలకు ప్యాన్ ఇండియా మార్కెట్ ఎలా ఉంటుందోననే అనుమానం ఉన్నవారికి... ఆ డౌట్స్ ఏమీ అక్కర్లేదని చెప్పేసింది జైలర్ సినిమా.

ప్రస్తుతం జైలర్ సీక్వెల్ పనుల్లో బిజీగా ఉన్నారు నెల్సన్. ఈ సినిమా కంప్లీట్ కాగానే తారక్ మూవీ మీద ఫోకస్ పెడతారు. అంతలో తారక్ - నీల్ సినిమా కూడా కంప్లీట్ అవుతుంది. తారక్ - నెల్సన్ మూవీకి అనిరుద్ మ్యూజిక్ ఇస్తారు. సో, అట్లీకి కలిసొచ్చిన పొరుగు స్టార్ సెంటిమెంట్.. నెల్సన్‌కి కూడా కలిసొస్తుందా? చూడాలని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్.




