- Telugu News Photo Gallery Cinema photos Who are ready for the buzz with their movies on Sankranti 2025?
Sankranthi Movies: సంక్రాంతి మూవీస్ సందడి షురూ.. సమరానికి సిద్ధమైంది ఎవరు.?
డిసెంబర్ సినిమాలు రిలీజ్ కౌంట్ డౌన్‌స్టార్ట్ చేసేసరికి, సంక్రాంతి మూవీస్‌లో సందడి షురూ అయింది. వీలైనంత త్వరగా అన్నీ పనులకు గుమ్మడికాయ కొట్టేసి, ప్రమోషన్ల మీద గట్టిగా కాన్‌సెన్‌ట్రేట్ చేయాలని ఫిక్సయ్యాయి. ఇప్పటికైతే సంక్రాంతికి పక్కగా రిలీజ్ అవుతున్న సినిమాలు మూడు... షూటింగ్ స్టేజ్‌లో ఉన్నవెన్ని.... దూకేయడానికి సిద్ధం అంటున్నవెన్ని చూసేద్దాం పదండి...
Updated on: Nov 22, 2024 | 12:23 PM

సంక్రాంతి పండగ వచ్చిందంటే బాలయ్య సినిమా లేకుంటే ఎలా? అనేంతలా అలవాటుపడిపోయారు నందమూరి అభిమానులు. వారి మాటలు విన్నారు కాబట్టే సంక్రాంతి సందర్భంగా జనవరి 12న వచ్చేస్తున్నానని అనౌన్స్ చేశారు డాకు మహారాజ్. టీజర్‌తోనే ఆకట్టుకున్నారు నందమూరి బాలకృష్ణ.

డాకు మహారాజ్ పనులు వేగం పుంజుకున్నాయి. ఓ వైపు ఫైనల్ షూటింగ్.. ఇంకో వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు మేకర్స్. డాకు మహారాజ్‌కన్నా రెండు రోజులు ముందే వస్తున్న గేమ్ చేంజర్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.

గేమ్ చేంజర్ షూటింగ్ ఆల్రెడీ పూర్తయింది. కొన్ని కొన్ని షాట్‌లు మాత్రం ఇప్పుడు తీస్తున్నారు కెప్టెన్. మరోవైపు ఆల్ ఇండియా రేంజ్‌లోనూ, ఓవర్సీస్‌లో ప్రమోషనల్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సంక్రాంతికి నేషనల్ వైడ్ బ్లాక్ బస్టర్ పక్కా అనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది గేమ్ చేంజర్ సర్కిల్స్ లో.

సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్‌తోనే ప్రాజెక్ట్ మీద తమకున్న నమ్మకం ఎలాంటిదో చెప్పకనే చెప్పేశారు వెంకీ - అనిల్. నాన్‌స్టాప్ షెడ్యూల్స్ తో షూటింగ్ పూర్తి చేస్తున్నారు. ఓ వైపు షూట్ చేస్తూనే, మరోవైపు అడపాదడపా అప్‌డేట్స్ తో ఫ్యాన్స్ లో ఖుషీ నింపే ప్రయత్నం చేస్తున్నారు.

డిసెంబర్ 15 నుంచి ఈ మూడు సినిమాల నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్‌డేట్స్ ఉంటాయన్నది ఫిల్మ్ నగర్‌ని ఊరిస్తున్న విషయం. వీరు ముగ్గురు 2019 సంక్రాంతికి కూడా పోటీపడ్డారు. అప్పుడు వెంకీ విజయ పతాకాన్ని ఎగురవేశారు. చుడాలిక.. ఈసారి గెలిచేదెవరో.?





























