- Telugu News Photo Gallery Cinema photos Thaman vs Devi Sri Prasad is now a hot topic in the film industry
Thaman VS DSP: తమన్ వర్సస్ దేవిశ్రీ.. మ్యూజికల్ వార్‌లో గెలిచేదెవరు.?
సినిమా జర్నీ పులిమీద స్వారీలాంటిది. ఎప్పుడూ స్వారీ చేస్తూనే ఉండాలి. ఏమాత్రం అలసట వచ్చి దిగామా... ఇక అంతే సంగతులు. అలుపు సొలుపూ లేకుండా ట్రావెల్ చేయాలి. ఈ విషయంలో ఇప్పుడు దేవీ అండ్ తమన్ పరిస్థితి ఒకేలా ఉంది... ఇద్దరూ కలిసి పుష్పకి పని చేస్తున్నారు.
Updated on: Nov 21, 2024 | 3:10 PM

పుష్ప2 కోసం అల్లు అర్జున్ అభిమానులు మాత్రమే కాదు... మ్యూజిక్ లవర్స్ కూడా చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన ట్యూన్స్ ఎలా ఉన్నాయి? తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? కంప్లీట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ని తమన్ ఒక్కరే చేస్తున్నారా? ఇంకెవరైనా షేర్ చేసుకుంటున్నారా? పుష్ప సీక్వెల్ చుట్టూ ఇలాంటి సరిగమల సందేహాలు చాలానే అల్లుకుంటున్నాయి.

డిసెంబర్ 5న పుష్ప సీక్వెల్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఆ ఆనందాన్ని దేవిశ్రీ ప్రసాద్ ఒక్కరే ఆస్వాదించే అవకాశం లేదు. కచ్చితంగా క్రెడిట్‌ని తమన్ అండ్ అదర్స్‌తో కలిసి షేర్ చేసుకోవాల్సిందే.

అలాగని మ్యూజిక్ విషయంలో ఏమైనా అసంతృప్తులున్నాయనుకోండి... అనవసరంగా అదర్స్ని ఇంటర్‌ఫియర్ చేశారు.. అదేదో దేవిశ్రీని చేయనిచ్చి ఉంటే.. ఇంతకన్నా బాగా చేసేవాడనే మాటలూ గట్టిగా వినిపిస్తాయి.

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో ఇప్పుడున్న కాంటెంపరరీ మ్యూజిక్ డైరక్టర్లలో తమన్‌కి ఓ మంచి పేరుంది. ఆ మధ్య అఖండ సినిమాను వేరే రేంజ్‌లో నిలబెట్టిన క్రెడిట్ తమన్‌కే సొంతం. ఈ డిసెంబర్‌లో పుష్ప2తో పాటు, సంక్రాంతికి రెండు సినిమాలను బ్లాక్ బస్టర్ చేయాల్సిన బాధ్యతను కూడా భుజాలమీద మోస్తున్నారు తమన్.

ఈ వారం కంగువతో ప్రేక్షకులను పలకరించిన దేవిశ్రీ ప్రసాద్, నెక్స్ట్ ఫిబ్రవరిలో కుబేరతోనే ప్రేక్షకుల ముందుకొస్తారు. సో... తమన్ వర్సస్ దేవిశ్రీ అనేది సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ మ్యూజికల్ వార్‌లో గెలిచేదెవరు? నిలిచేదెవరు? అనేది ఆసక్తికరం.




